నేనూ అమ్మనేగా?


Sun,April 15, 2018 11:17 PM

పిల్లలు పుడితే ఉద్యోగం చేసుకోవద్దా? శరీరాకృతి ఎప్పుడూ ఒకేలా ఉండాలా? అలా లేకపోతే దూషించడమేనా? ఆకారాన్ని, రంగును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడమేనా మానవత్వం? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నది అమెరికాకు చెందిన ఓ మహిళ. మహిళల శరీరం, వర్ణం గురించి మాట్లాడేవాళ్లు ఇకనైనా కళ్లు తెరవాలి అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నది ఆమె.
Bad-Mom
సియా కూపర్ అనే ఆవిడ అమెరికాలో పర్సనల్ ట్రైనర్‌గా పనిచేస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శరీర ఆకృతిలో మార్పులొచ్చాయి. వర్ణమూ మారింది. అంతమాత్రాన నేను మహిళ కాకుండా పోతానా? అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నది. ఆమె ఆన్‌లైన్లో పనిచేస్తున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారట. మరుగుజ్జు అనీ, పతివ్రతవు కావు అనీ వేధిస్తున్నారట. అలా మాట్లాడేవాళ్లందరికీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది సియా. మాకు ఎన్ని సమస్యలున్నాయో ఎవరికి తెలుసు? పెళ్లి, ప్రసవం తర్వాత జరిగే శారీరక మార్పులు ఒక్కోసారి పూర్తి ఆకారాన్ని, వర్ణాన్ని మార్చేస్తాయి. ఇవన్నీ ఎవరికి చెప్పాలి? అన్ని అవస్థలూ పడి తిరిగి మామూలు ఆకారానికి, రంగుకు రావాలంటే ఎంత కష్టమవుతుంది? ఒకవేళ ప్రయత్నించినా ఫలితముండదు. ఇది ఎవరూ అర్థం చేసుకోరు. ఇద్దరు పిల్లలు పుట్టగానే వంటింటినే అంటిపెట్టుకొని ఉండాలా? ఉద్యోగం చేయకూడదా? ఆడవాళ్లు ఉద్యోగం చేస్తే దానికి పాతివ్రత్యానికి లింక్ పెడతారా? నేనూ అమ్మనేగా అంటూ ఆమె పెట్టిన పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నది. అందర్నీ ఆలోచింపజేస్తున్నది.

715
Tags

More News

VIRAL NEWS