పెరిగిన ఉల్లి ధరలు.. పెలిన జోకులు!


Wed,December 11, 2019 12:52 AM

పదికి రెండు కిలోలు.. పదికి రెండు అంటూ పలికిన ఉల్లిధర.. ఇప్పుడు.. అగ్గువా అగ్గువా కిలోకి వంద.. రెండొందలు అంటూ పలుకుతున్నది. మామూలుగా రేట్లు పెరిగితే వామ్మో.. వాయ్యో అంటాం కదా? ఇదంతా సీరియస్ మ్యాటర్. బట్ ఎ చేంజ్. జనాలు రూటు మార్చారు. ఉల్లిధర తీవ్రతను సీరియస్‌గా చెప్పకుండా జోకులేసేస్తున్నారు. ఉల్లిలొల్లికి హ్యూమర్ బాంబులేస్తూ బాప్‌రే అనిపిస్తున్నారు. అందుకే ఇప్పుడెక్కడ చూసినా.. ఉల్లి ఉల్లాసమే కనిపిస్తున్నది. ఉల్లిఘాటుతో పాటు.. హుషారైన హాస్యమూ హీటెక్కుతున్న నేపథ్యంలో కథనం.
Onions-jokes
వదినా ఓ రెండు ఉల్లిగడ్డలు బదులివ్వవా? అంటే.. రెండు కాకపోతే రెండు కిలోలు తీసుకెళ్లొదినా అనేది పాత డైలాగ్. ఇప్పుడు చేంజ్. సారీ వదినా.. బంగారమైనా ఇస్తాగానీ ఉల్లిగడ్డలు రెండు కాదు కదా.. ఒక్కటి కూడా ఇవ్వలేను అంటున్నారు. అవును మరి.. పక్కింటి ముచ్చట్లు ఇలానే ఉంటున్నాయిప్పుడు. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు రాలుతాయనేది విన్నాం కదా? అదే ఇది. ఉల్లిరేటు తీవ్రత ఏంటో తెలుపుతూనే దానికి చక్కటి హాస్యాన్ని జోడిస్తున్నారు. ఇంకొందరైతే పెండ్లిళ్లో ఉల్లిగడ్డలు ప్యాక్ చేసి గిఫ్ట్‌లుగా ఇస్తున్నారు. కొందరైతే.. ఉల్లిగడ్డల ధరల తీరును తెలిపేందుకు అల్లుడు ఉల్లిగడ్ల రైతైనా బాగుండు అనుకుంటున్నారు. ఇది రోజూ మనం చూస్తూనే ఉన్నాం. కార్టూన్‌ల రూపంలో.. వీడియోల రూపంలో.. కవితల రూపంలో ఇలా జోక్సే జోక్సు.!


ఉల్లి బాంబ్‌లు

రమేశ్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని నమ్మించాడు. మొదట స్నేహం అన్నాడు. తర్వాత ప్రేమ అన్నాడు. నెమ్మదిగా పరిచయం పెంచుకున్నాడు. అమ్మాయి వివరాలు, కుటుంబ నేపథ్యం తెలుసుకున్నాడు. తేనెపూసిన కత్తిలా తీయని మాయమాటలు చెప్పి ఆమె చిరునామా తెలుసుకున్నాడు. బయట కలవడం నాకిష్టముండదని మర్యాదస్తుడిలా మాట్లాడాడు. ఓ రోజు మిట్టమధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనిది తెలుసుకొని ఇంట్లోకి వచ్చాడు. ఎవరూ రారని నిర్ధారించుకున్నాడు. నెమ్మదిగా మాటల్లో దించాడు. అప్పటికే జేబులో సిద్ధం చేసుకున్న మత్తుమందు కలిపిన చాక్లెట్ తీసిచ్చాడు. అది తిన్న ఆ యువతి నెమ్మదిగా సోఫాలో ఒరిగింది. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వడివడిగా వంటింట్లోకి నడిచి తన వెంట తెచ్చుకున్న సంచి నిండా ఉల్లిపాయల్ని సర్దేసుకున్నాడు. సంచిలో కుక్కుకుని పారిపోయాడు.

ముగ్గురు కుర్రాళ్లు... ఓ అమ్మాయి వెంట పడుతుంటారు. వారి నుంచి రక్షించుకోవడానికి అమ్మాయి పరుగు పెడుతుంది. కానీ ఆమెను వదలకుండా కుర్రాళ్లు ఆమె వెనుకే అనుసరిస్తారు. చివరికి వీరి బాధ పడకలేక ఆ అమ్మాయి తన చేతిలో ఉన్న వాటిని కింద పడేసి పరిగెడుతుంది. వెంటనే ఆ ముగ్గురు కుర్రాళ్లు వాటిని అందుకుంటారు. ఇంతకీ ఆమె కింద పడేసినవి డబ్బులు.. బంగారం కాదు.. ఉల్లిపాయలు.

భార్యను ప్రేమతో దగ్గరకు తీసుకుంటాడు భర్త. ఒక ప్యాకెట్‌ను చేతిలో పెడతాడు. తన కోసం ఏం గిఫ్ట్ తెచ్చారో అని సంబరపడుతూ దానిని తెరుస్తుంది. అందులో ఒక చిన్న బాక్సు ఉంటుంది. అందులో ఉన్న వస్తువును చూసి ఒక్కసారి అవాక్కవుతుంది. ఇంతకీ ఆ పెట్టెలో ఉన్నది ఏమిటో తెలుసా... ఉల్లిగడ్డ.

వంటింట్లో వంట చేస్తున్న భార్య.. కుర్చీలో కూర్చొని కునికిపాట్లు పడుతున్న భర్త వద్దకు ఆడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వస్తుంది. చప్పుడు లేకుండా మెల్లగా భర్త జేబులో ఉన్న బీరువా తాళం చెవిని తీసే ప్రయత్నం చేస్తుంది. గమనించిన భర్త వెంటనే తేరుకొని భార్య చేయి పట్టుకుంటాడు. దొంగతనం ఎందుకు చేస్తున్నావన్నట్లు ఆమె వైపు చూస్తాడు. అసలు విషయం అర్థమై.. తనే బీరువా వద్దకు వచ్చి రెండు ఉల్లిగడ్డలు తీసి భార్య చేతిలో పెడతాడు. భర్త చేష్టలతో ఆశ్చర్యపోవడం భార్య వంతు అవుతుంది.

ఉంగరంలో ఉల్లిపాయ.. తాంబూలంలో ఉల్లిపాయలు. పేకాట రాయుళ్ల పందాల్లో ఉల్లిపాయలు. పెళ్లి రిసెప్షన్ లో పెళ్లి కూతురుకి..పెళ్లి కొడుక్కి గిఫ్ట్ గా ఉల్లి పాయలు. జువెలరీ బాక్సుల్లో ఉల్లిపాయలు. తన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తున్న ఓ వ్యక్తి దగ్గరకు సడెన్ గా ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు వచ్చారు. మేం ఇన్ కమ్ ట్యాక్స్ అధికారం..మీ ఇంట్లో కూరల్లో ఉల్లిపాయలు వాడుతున్నారనీ తెలిసింది అందుకే మీ ఆస్తులపై రైడ్ చేయటానికి వచ్చామని కార్టూన్ తెగ
నవ్విస్తున్నది.

ఉల్లి వారిమండీ!

Onions-jokes5
డబ్బున్నవారు బంగారం, ఆభరణాలతో పెండ్లికూతురుని అలంకరిస్తారు. బంగారాన్నే ఎందుకు ఎంచుకుంటారంటే. అవి చాలా విలువైనవి కాబట్టి.. ఇప్పుడు అంతకంటే విలువైనవి ఉల్లిగడ్డలంటున్నారు. అందుకే పెండ్లికూతురు అలంకరణ విషయంలో జడపట్టీ నుంచి పూర్తి వడ్డానం, కమ్మలు, మెడలో దండలు, కాళ్ల పట్టీల వరకు పూర్తి అలంకరణకు ఉల్లిగడ్డల్నే ఉపయోగించారు.

నవ్వు తెప్పించే వాస్తవాలు

ఉల్లిగడ్డలు సంచులకొద్దో.. క్వింటాళ్ల కొద్దో దొంగతనం చేస్తే మనం ఇక్కడ చెప్పుకోకపోయేవాళ్లం. కానీ ఇది మాత్రం కచ్చితంగా చెప్పుకొని తీరాల్సిందే. ఎందకంటే మనోడు ఇక్కడ చేసింది అద్దకిలో ఉల్లిగడ్డల దొంగతనం. నిజంగా నవ్వుతెప్పించే యవ్వారమే.

పంజాబ్‌లోని కపూర్థలాలో వింతైన రీతిలో ఉల్లి దొంగతనం జరిగింది. అరకిలో ఉల్లిపాయలను చోరీ చేసిందనే ఆరోపణతో పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. పంజాబ్‌లోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో కిరణ్ అనే మహిళ ఉంటున్నది. రేఖ అనే మహిళ ఇంట్లో తరచూ వస్తువులు పోతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు ముందడుగు వేయలేదు. అయితే కిరణ్ ఎవరికీ తెలియకుండా ఇంట్లో ఓ సీసీ కెమెరా ఏర్పాటు చేసింది. అందులో పనిమనిషి రేఖ అరకిలో ఉల్లిపాయలు దొంగతనం చేస్తుండగా రికార్డయ్యింది. ఇదిప్పుడు చర్చనీయాంశం అవుతున్నది.

ఉల్లి కానుక ఒకప్పుడు ఇంట్లో బంగారం ఉంటే ధనికులు అనేవారు. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఉంటే ధనికులు అంటున్నారు. ఇటీవల వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో జరిగిన పెండ్లిలో ఓ వింత బహుమతి అందర్నీ ఆకట్టుకున్నది. సాయి సందీప్ - శ్రీజల రిసెప్షన్‌కు వారి స్నేహితులు కొంచెం బరువుగా ఉన్న బహుమతిని ఇచ్చారు. రిసెప్షన్‌లోనే బహుమతి ఏంటో చూడాలని అక్కడివారంతా కోరారు. సరే అంటూ బరువుగా ఉన్న గిఫ్ట్‌ను మెల్లగా పట్టుకొని తెరిచి చూసే సరికి రెండు కిలోల ఉల్లిగడ్డలు ఉన్నాయి. ఇంతకంటే పెద్ద బహుమతి ఏముందంటూ అక్కడి వారంతా ఆనందం వ్యక్తం చేశారు.

ఈ ఉల్లిధరల భారాన్ని

Onions-jokes3
బాహుబలి ఒక్కడే మోయగలడు అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈనేపథ్యంలో శివలింగాన్ని ఎత్తుకున్న ప్రభాస్ ఫొటో నెట్టింట వైరల్ అవుతున్నది.

10 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఈఎంఐ ఫ్రీ అండ్ స్పీడ్ డెలివరీ @ ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉల్లి

ఇన్నాళ్లూ మిర్చీకే ఘాటెక్కువ అనుకున్నాం..
ఇప్పుడు ఉల్లికీ ఘాటెక్కువే..
గుండెమంట అనుకున్నవా అక్కయ్యా.. ఇది ఉల్లిమంట..
@ మార్కెట్‌లో ఓ మహిళ

నువ్వు లేకుండా నాకేం బాగోలేదు.
ఆకలి అవడం లేదు..
భోజనం రుచించడం లేదు..
తినేటప్పుడు నువ్వుంటే బాగుండు అనిపిస్తుంది. .
రాత్రి కలలోకి వస్తున్నావు..
ఎక్కడికెళ్లినా నువ్వే గుర్తొస్తున్నావు. .
నా ఇంట్లో వెలతి ఉంది.. వంటిల్లు బోసి పోయింది.
నీ కోసం నా గది తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచుతా..
ఎప్పుడు వస్తావంటే ఏమో తెలియదు కానీ
ఇక రాను అంటే లోపలేదో నొప్పిగా ఉంది..
ధర ఎప్పుడు తగ్గుతావు? ఇంటికెప్పుడు వస్తావు..
@ఉల్లిగడ్డకో ప్రేమలేఖ

Onions-jokes2
లవ్యూ.. అబ్బాయి ప్రపోజ్ చేశాడు
అమ్మాయి నో అన్నది
నా దగ్గర కారుంది
నో..
అయామ్ ఏ మిలియనీ
నో
ఇదిగో ఈ రింగ్ నీకోసమే
గోల్డా, ప్లాటీనమా?
ఆనియన్
అమ్మాయి ఇంప్రెస్‌డ్.

అక్కడా.. ఇక్కడా.. ఎక్కడైనా
రాత్రి పదకొండవుతున్నది.
వీధిలో భయపడుకుంటూ వెళ్తున్నాడో అబ్బాయి..
హెల్ప్ అని గట్టిగా కేకేశాడు. ఎవరూ రాలేదు.
ఇంకో సారి ప్రయత్నించాడు.
ఈసారి అన్ని ఇండ్లలో లైట్లు వెలిగాయి
అందరూ భయటకు వచ్చారు.
అబ్బాయి హ్యప్పీగా నడుచుకుంటూ వెళ్లాడు..
@ ఉల్లిగడ్డలు కిలో 30 అని అరిచాడాతను వీధిలో

అంత కట్నం ఎందుకంటా?..
ఇంతకీ అబ్బాయేం చేస్తాడు..?
ఉల్లిగడ్డల వ్యాపారం..
@ ఓ ఇంట్లో పెండ్లి చూపులు

.ఏరా! ఉద్యోగం
వదిలేస్తా అంటున్నావంటా?
అవున్రా! ఉల్లిగడ్డలు అమ్ముకోవడం
బెటర్ అనిపిస్తుంది
@ చేపల మార్కెట్‌కు ఫ్రెండ్స్‌తో వచ్చిన
ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.

ఏం రమణమ్మ.. అబ్బాయికేం పేరు పెట్టావ్
మొన్నటి వరకూ బంగారం అని పిలిచా.. ఇప్పుడు ఉల్లిగడ్డ అని పెట్టా
@ ఓ ఆడపడచు.

ఏటీఎం ఎదుట క్యూ..
వరుసను కాదని అందరినీ దాటుకుంటూ వెళ్తున్నాడు టిప్‌టాప్‌గా వచ్చిన వ్యక్తి.
అతన్ని అడ్డగించాడో వ్యక్తి..
మేరా పాస్ కార్ హై, బంగ్లా హై.. తుమారా పాస్ క్యాహైరే? గద్దిరించాడు ఆపినందుకు.
రెండు బండ్ల నిండా ప్యాస్ హై!..
జవాబిచ్చాడు వెనక్కి వెళ్లి నిల్చో అన్నట్టు.

ఒకప్పుడు ఇంట్లోని పాత కాగితాలు ఇస్తే ఉల్లిగడ్డలు ఇచ్చేవారు..
ఇప్పుడు ఇంటి కాగితాలు ఇస్తే ఇస్తున్నారు.
@ ఫ్రెస్టేటెడ్ ఆనియన్ బయ్యర్.
Onions-jokes4
కేజీ ఉల్లిగడ్డలివ్వండి
హ.. రూ. 230 ఇవ్వండి
ఏంటి నిన్న 150నే అన్నారు
అది నిన్న
@ రోజురోజుకూ పెరుగుతున్న ఉల్లి ధరలు..
ఏంటి ఆనియన్ దోశలో ఆనియన్ లేదు
మైసూర్ బోండాలో మైసూర్ లేకున్నా తింటావ్‌గా.. ఇదీ అంతే
@ టిఫిన్ సెంటర్ ఓనర్
నీ ఫ్రెండ్ అంత ధనవంతుడా
అవును
ఎంత ఆస్తి ఉంది
ఆనియన్ దోశ, ఆనియన్
చట్నీతో తినేంత

ఒక వ్యక్తి ఆటో ఎక్కుతాడు. తను వెళ్లే ప్రదేశం చెప్పి ఛార్జీ మాట్లాడుకుంటాడు. ఆటో దిగే సమయంలో డబ్బులకు బదులు మూడు పెద్ద ఉల్లిగడ్డలు ఇస్తాడు. చిల్లర కింద ఆటో డ్రైవరు సైతం రెండు చిన్నవి ఇచ్చి తీసుకో అనడంతో ఆశ్చర్యపడటం ఇద్దరి వంతు అవుతుంది.
Onions-jokes1

901
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles