ప్రేమికులను కలిపే యాప్‌


Wed,December 11, 2019 12:11 AM

dilmil
భారత్‌లో 90 శాతం పెండ్లిళ్లు పెద్దలు నిశ్చయించినవే. ముఖ పరిచయం లేకపోయినా, ఆస్తులు, అంతస్తులు, బంధుత్వాలు చూసి చేసేవే. అరేంజ్‌ మ్యారేజెస్‌ చేయడానికి పెద్దలు, మధ్యవర్తులే ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ యాప్‌ ప్రేమ వివాహాల్ని ప్రోత్సహిస్తున్నది. కేవలం ప్రేమికుల్ని కలిపేందుకే ఇది రూపొందించింది.


శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఏర్పాటయిన ‘దిల్‌మిల్‌' యాప్‌ దక్షిణాసియా దేశాల్లో యమ స్పీడ్‌గా దూసుకెళ్తున్నది. అమెరికా, కెనడా, బ్రిటన్‌ దేశాల్లో కోట్ల మంది ఈ యాప్‌కు యూజర్లున్నారు. ఇప్పటికే ఈ యాప్‌ ద్వారా రెండు కోట్లకు పైగా పెండ్లిళ్లు జరిగాయట.! రోజుకు కనీసం ఒక్క పెండ్లి చేయడానికి ‘దిల్‌మిల్‌' టీం కృషి చేస్తుందట. అమెరికా, కెనడాలతో పాటు బ్రిటన్‌, యూరప్‌ దేశాల్లో నివసిస్తున్న దక్షిణాసియా దేశాలకు చెందిన యువత ఈ యాప్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. 2040 వరకు ప్రతి పది మందిలో ఏడుగురు దీని ద్వారా కలుసుకుంటారని ఈ యాప్‌ వ్యవస్థాపకులు చెబుతున్నారు. అయితే ఈ యాప్‌ సేవలు త్వరలో భారత్‌లో విస్తరించనున్నట్లు దిల్‌మిల్‌ సీఈవో కేజే దలివాల్‌ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘ప్రేమ పెండ్లిళ్లు పెరుగడమే మా లక్ష్యం. ప్రేమమయ ప్రపంచంగా మార్చేందుకు ఈ యాప్‌ తోడ్పడుతుంది. ప్రేమ వివాహాల ద్వారా కులం అంతరించిపోతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

740
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles