రాత్రివేళల్లో సురక్షిత ప్రయాణానికి!


Wed,December 11, 2019 12:01 AM

maps
ట్రాఫిక్‌ను గుర్తించి సులభతర మార్గాన్ని చూపించే ‘గూగుల్‌ మ్యాప్‌' ఇప్పుడు ఇంకో అద్భుత ఫీచర్‌ను జోడించబోతున్నది. రాత్రివేళ వీధుల్లో నడుచు కుంటూ వెళ్లే వాళ్లకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న ఫీచర్లకు జోడీగా ‘లైటింగ్‌' అనే ఫీచర్‌ను చేరుస్తున్నది. రాత్రి సమయంలో ఏ వీధిలో దీపాలు వెలుగుతున్నాయో, ఎక్కడ వెలగడం లేదో గుర్తిస్తుంది. వీటిని మ్యాప్‌లో ‘పసుపు’రంగు గీతగా చూపిస్తుంది. తక్కువ వెలుతురు ఉన్నా, అసలు వెలుతురూ లేకపోయినా ఆ వీధిని గుర్తిస్తుంది. దీని ద్వారా మీరు వెళ్లాల్సిన వీధిలో వీధి దీపాలు వెలుగుతున్నాయో లేదో ముందే తెలుసుకొని సురక్షితంగా వెళ్లే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి.

225
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles