హువావే స్మార్ట్‌వాచ్‌


Tue,December 10, 2019 11:58 PM

G2-smart-watch
చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ నుంచి ఓ స్మార్ట్‌ వాచ్‌ విడుదలైంది. ‘జీటీ 2’ స్మార్ట్‌వాచ్‌ పేరుతో ఇది అందుబాటులో ఉంది. జీటీ 2 వాచ్‌ రెండు వేరియేషన్లలో ఆకట్టుకుంటున్నది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, ఇతర రిటైల్‌ స్టోర్‌లలోనూ ఇది విక్రయానికి ఉంది.


స్మార్ట్‌వాచ్‌ ఫీచర్లు

1.2 అంగుళాల అమోలెడ్‌ టచ్‌ డిస్‌ప్లే, రౌండ్‌ డయల్‌, హువావే కిరిన్‌ ఎ1 చిప్‌, 3డీ గ్లాస్‌, బ్లూటూత్‌ 5.1 వాటర్‌ రెసిస్టెన్స్‌, జీపీఎస్‌, ఇంటెగ్రేటెడ్‌ మైక్రోఫోన్‌ అండ్‌ స్పీకర్‌, బ్లూటూత్‌ కాలింగ్‌, ఆప్టికల్‌ హార్ట్‌ రేట్‌ సెన్సార్‌, 15 వర్కవుట్‌ మోడ్స్‌, ధర- 46 ఎంఎం స్పోర్ట్‌ (నలుపు) రూ.15,990, లెదర్‌ స్ట్రాప్‌ మోడల్‌ రూ.17,990, మెటల్‌ స్ట్రాప్‌ రూ.21,990. 42 ఎంఎం వేరియంట్‌ ప్రారంభ ధర రూ. 14,990. అంతేకాదు ఈ స్మార్ట్‌వాచ్‌ వినియోగదారుని హార్ట్‌ బీట్‌ను మానిటర్‌ చేస్తుందని, స్పందన రేటు 100 బీపీఎం కంటే ఎక్కువ లేదా 50 బీపీఎం కంటే తక్కువ 10 నిమిషాలకు మించి ఉంటే యూజర్‌ను అలర్ట్‌ చేస్తుందని, స్విమ్మింగ్‌ చేస్తున్నపుడు కూడా ఈ వాచ్‌ పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది.

153
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles