శ్రీజ డెయిరీ మహిళలతో నడుస్తున్న సంస్థ!


Mon,December 9, 2019 12:55 AM

sreeja
చిత్తూరు జిల్లాలలోని గ్రామాల్లో ఒకప్పుడు మహిళలకు ఒక ఆవు మాత్రమే ఉండేది. దీంతో వచ్చిన డబ్బుతోనే ఖర్చులు వాడుకునేవారు. ఇప్పుడలా కాదు శ్రీజ డెయిరీ వారి జీవితాలను మార్చింది. నాలుగు ఆవులతో పాటూ పొలం సాగుచేస్తున్నారు. ఇదంతా శ్రీజ డెయిరీవల్లనే అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


2006 ప్రాంతంలో లీటర్‌ పాలకు రైతులకు రూ. 6 ఇచ్చిన రోజులున్నాయి. దాంతో కుటుంబం నడపాలంటే నానాఅవస్థలు పడేవారు. ఆ క్రమంలో దేశవ్యాప్తంగా ఎన్డీడీబీ మూడు కంపెనీలను ప్రారంభించింది. వాటిలో శ్రీజ ఒకటి. మిగిలిన కంపెనీల్లో ఆడ, మగ ఇద్దరూ సభ్యులుగా ఉంటారు. శ్రీజను మహిళలకే ప్రత్యేకంగా ఉంచారని శ్రీజ ప్రస్థానం ప్రారంభమైన విధానాన్ని జయతీర్థ వివరించారు. ఉత్పత్తి చేసే వారే భాగస్వాములుగా, వాటాదార్లుగా ఉంటారు. అంటే.. సహకార స్ఫూర్తితో, కార్పొరెట్‌ యాజమాన్యంతో ఉండేదే ప్రొడ్యూసర్‌ కంపెనీ. ఇది చట్టాలకు లోబడి స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇప్పుడు మొత్తం మహిళలే ఉన్న ప్రపంచలోని అతి పెద్ద ప్రొడ్యూసర్స్‌ కంపెనీ శ్రీజ అని చెబుతున్నది సంస్థ యాజమాన్యం. శ్రీజ ప్రస్థానం అంత సులువుగా సాగలేదు. ప్రారంభంలో సభ్యత్వం కోసం మహిళలను ఒప్పించడం కష్టమైందని సంస్థ చైర్మన్‌ లావణ్య అంటున్నారు. కొందరు ఖాతాలు తీసుకున్న తర్వాత వారి ఆదాయం తెలిసి మిగతావాళ్లు కూడా పాస్‌ పుస్తకం, ఆధార్‌కార్డులు తీసుకొని మేము కూడా చేరుతామంటూ వస్తున్నారు. 2014లో 27 మందితో ప్రారంభమై నాలుగేండ్లలో 72 వేల మందికి పైగా మహిళా సభ్యులున్న సంస్థగా అవతరించింది శ్రీజ డెయిరీ.
sreeja1
వీరే కంపెనీ సభ్యులు, ఓనర్లు. ఇప్పుడు శ్రీజ రోజుకు నాలుగున్నర లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నది. గతేడాది రూ. 415 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. సభ్యులు ఓనర్లుగా ప్రపంచంలో మరే కంపెనీలో ఇంత సంఖ్యలో మహిళలు లేరు. గ్రామాల్లో భర్త వ్యవసాయం చేస్తుంటే భార్య పాడి చేస్తూ డబ్బు సంపాదిస్తుంటుంది. ఇంటిఖర్చులు, పిల్లలు స్కూల్‌ ఫీజులు మహిళలే చూసుకుంటారు. ప్రతిదానికి భర్తను అడగనవసరం లేదంటున్నారు. అంతేకాదు పాలుపోసే వారిలో చదువుకున్న మహిళలను ఎంపిక చేసి వారికి బోర్డు వ్యవహారాల్లో శిక్షణ ఇచ్చి మరీ కంపెనీలో పదవులు ఇస్తున్నారు. కేవలం బోర్డుస్థాయిలోనే కాకుండా గ్రామస్థాయి నుంచీ మహిళా పాలఉత్పత్తిదార్ల బృందాల నిర్మాణం ఉంది. ఆ సమావేశాల్లో కూడా మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక్కడ మెంబర్లు, ఎంఆర్జీలు, వీఆర్జీలు, బోర్డులో డైరెక్టర్లూ అందరూ ఆడవారే. శ్రీజ అంటే ఆడవారిదే అంటూ అక్కడ మహిళలు సగర్వంగా చెప్పుకుంటున్నారు.

664
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles