ఈ తరం వారికోసం భగవంతుని కథ!


Sun,December 8, 2019 01:05 AM

Hasta-bhooshanam
మందార మకరందం వంటి శ్రీమద్భాగవతాన్ని సంస్కృత మూలంలోంచి తెలుగులోకి అనువదిస్తున్న, వ్యాఖ్యానిస్తున్న పండిత కవులు ఎందరో. అందులోని సారాన్ని మృదుమధుర ప్రవచనాల రూపంలో వినిపిస్తున్న వారూ ఉన్నారు. మొత్తం ద్వాదశ (12) స్కంధాల (భాగాలు)ను అన్నింటిలోంచి ముఖ్యమైన ఆణిముత్యాల వంటి అంశాలను ఎన్నుకొని, వాటిలోని తత్త ఇతివృత్తాలను పూసగుచ్చినట్లు ‘సప్తాహ’ (ఏడు) ప్రసంగ కార్యక్రమాలుగా అందిస్తున్న వారూ ఉన్నారు. ఇందులో భాగంగానే తెలుగు రాష్ర్టాలలో సుప్రసిద్ధులైన సంస్కృతాచార్యులు, కవి పండితులు అమరేశం రాజేశ్వరశర్మ తనదైన శిల్పం, శైలితో చేసిన సప్తాహ ప్రసంగాలకు ఇప్పటికి గ్రంథరూపమిచ్చారు. ‘భాగవతసుధ’ పేరుతో ఏడు సుదీర్ఘ, విమర్శనాత్మక ప్రసంగాలతో కూడిన ఈ సంకలనం ఇటీవలె వెలువడింది. కొవ్వూరులోని ‘ఆర్షధర్మ ప్రచురణ’ (ఆంధ్రగీర్వాణ విద్యాపీఠం) సంస్థ వారు దీనిని ముద్రించారు. ఇందులో సంపూర్ణ భాగవత స్వరూపం సాక్షాత్కరించినట్లు ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖశర్మ ప్రశంసించారు. 90 ఏండ్ల వయసులో కూడా ప్రతీ నెలలో 15 రోజులు కొవ్వూరు సంస్కృత కళాశాలకు సేవలందిస్తూ, భాగవతగాథామృతాన్ని గ్రంథస్థం చేయడం అత్యంత అభినందనీయమని మైసూర్‌ అవధూత దత్తపీఠం విద్యాధికారి ఆచార్య కుప్పా వేంకట కృష్ణమూర్తి పేర్కొన్నారు. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ లీలలను ఈ తరం సామాన్య పాఠకులకు అర్థమయ్యేలా రచయిత చక్కని కథనంతో అందించడం విశేషం.


(ప్రతులకు: భాగవతసుధ, రచన: ‘కులపతి’ ప్రాచార్య అమరేశం రాజేశ్వరశర్మ, రచయిత చిరునామ: 80, ఎస్‌ఆర్‌టీ, మున్సిపల్‌ కాలనీ, మలక్‌పేట, హైదరాబాద్‌-36. సెల్‌: 94407 84614.)

271
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles