ఫుడ్ పాయిజన్ సమస్యలు తగ్గించే చిట్కాలు


Sun,December 8, 2019 12:34 AM

Food-poisoning
-సాధారణంగా ఎక్కువగా నిల్వ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు, లేక రకరకాల ఆహారం తీసుకున్నప్పుడు ఫుడ్ పాయిజన్ సమస్య ఎదురవుతుంది. శుభ్రంగా లేని ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంటుంది. అందుకని పరిశుభ్రమైన తాజా ఆహారాన్ని తింటే ఫుడ్ పాయిజనింగ్ సమస్యకు దూరం కావచ్చు.
-సమస్య ఉన్నప్పుడు తులసి ఆకుల రసాన్ని ఓ కప్పు నీటిలో టీ స్పూన్ పరిమాణంలో తీసుకొని అందులో కొద్దిగా తేనెను కలపాలి. ఇలా తయారైన డ్రింక్‌ను రోజుకు కొద్దిసార్లు తీసుకుంటూ ఉండాలి. ఇష్టం ఉంటే దీనికి కాస్త కొత్తిమీర రసాన్ని కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల కడుపు నొప్పి, జీర్ణసమస్యలు ఎదురవవు.
-వెల్లుల్లిలోనూ బలమైన యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల విరేచనాలు, కడుపు నొప్పి తగ్గుతుంది. వెల్లుల్లిని రసంలా చేయాలి.

228
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles