తెలుగు సినిమా అభిమానుల కోసం..


Wed,December 4, 2019 12:55 AM

Team-PHoto
ఇష్టమైన భోజనం ఆర్డర్‌ చేయగానే ఇంటికి వస్తుందంటే అది ఒకరికి వచ్చిన ‘ఐడియా’..రంగు రంగుల పూలు సీసాల్లో పెరుగుతున్నాయంటే దాని వెనుక ఓ ‘ఐడియా’..రోడ్లమీద గుంతలు చూపించడానికి ‘ఆస్ట్రోనాట్‌' వచ్చాడంటే అది ‘ఐడియా’..లైసర్‌ లైట్లలో పేర్లు పరుగెడుతున్నాయంటే అదో ఐడియాడస్ట్‌బిన్‌లో ఉండాల్సిన చెత్త అందంగా తయారై ‘షోకేస్‌ సెల్ఫ్‌'లో ఉందంటే ఒక ‘ఐడియా’..అందమైన బ్యాగ్‌ మీద పిచ్చుకలు వస్తున్నాయంటే ఒకరి ఐడియా..ప్రపంచాన్ని నడిపించేది అన్నిటికన్నా ముందు ‘ఐడియా’ .. ఆ ఐడియాకు క్రియేటివిటీ జోడైతే.. మీరే ట్రెండ్‌ సెట్‌ చేసినవాళ్లవుతారు.ఇప్పుడు చెప్పుకోబోయే ‘మ్యాడ్‌మంకీ’ ఫ్యాషన్‌ బ్రాండ్‌ స్టార్టప్‌ అచ్చం అలాంటిదే..


మీ సర్కిల్‌లో ఎవరైనా తమిళ్‌, మలయాళం ఫ్రెండ్స్‌ ఉన్నారా? అయితే ఒక్కసారి వాళ్ల ఫేస్‌బుక్‌ టైంలైన్‌ చూడండి. లేదా తమిళ్‌, కన్నడ, మలయాళంకు సంబంధించిన ఏదైనా ప్రొడక్ట్‌నో, వెబ్‌సైట్‌లో, ఫేస్‌బుక్‌ పేజీనో చూడండి. అవి దాదాపు ప్రాంతీయ భాషలోనే కనిపిస్తాయి. ఇద్దరు తమిళ్‌ లేదా మలయాళం ఫ్రెండ్స్‌ మెసేజులు చేసుకున్నా, కామెంట్స్‌ రాసుకున్నా వారి ప్రాంతీయ భాషల్లోనే చేస్తారు. కానీ తెలుగు వాళ్ల విషయానికి వస్తే.. అదీ యాస విషయానికి వస్తే.. కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. ఎక్కడో వెలితి ఉన్నట్టు అనిపిస్తుంది. కనీసం తెలుగులో ఫేస్‌బుక్‌ పోస్ట్‌ కూడా వేయాలనుకోం. ‘తెంగ్లిష్‌' వాడి కలగాపులగం చేసేస్తాం.. ఇలాంటి వాటిని చాలా దగ్గర నుంచి చేశాడు ‘అవినాష్‌' అనే హైదరాబాద్‌ యువకుడు.
Team-PHoto1
గ్రాఫిక్‌ డిజైనర్‌గా డిగ్రీ చేసిన అవినాష్‌.. హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లాడు. కొన్ని రోజులు అక్కడ డిజైనింగ్‌లో పని చేశాడు. అక్కడ లాంగ్వేజ్‌ కల్చర్‌ను ఎక్కువ పరిశీలించాడు. అక్కడి యూత్‌ ఎక్కువగా వారి భాషను ఆదరిస్తారు. కానీ తెలుగు రాష్ర్టాల్లో, తెలుగు భాష మీద ఉండే క్రేజ్‌లో ఎక్కడో అతనికి చిన్న లోటు కనిపించింది. దీంతో తెలుగు భాషను యూత్‌లోకి తీసుకెళ్లాలి అనుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగుదనం కనిపించాలనుకున్నాడు. ఆలోచించాడు. చైన్నైలో ఉన్నప్పుడు తమిళ భాషతో ముడిపడి ఉన్న ఆయా రంగాలను తెలుసుకున్నాడు. ఇండస్ట్రీ నుంచి ఫ్యాషన్‌ దాకా వివరాలు కనుకొన్నాడు. అప్పుడే వచ్చింది అవినాష్‌కు ‘ఐడియా’.. తెలుగు భాష + సినిమాను మిళితం చేసి కొత్త ఫ్యాషన్‌ బ్రాండ్‌ను పరిచయం చేయాలని.
Team-PHoto4
ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్స్‌ పుట్టుకొస్తున్నాయి. మన యాసతో, మన భాషతో ఫ్యాషన్‌ను ఏర్పాటు చేయాలనుకున్నాడు. అవినాష్‌. సృజనా నైపుణ్యాలను ఉపయోగించి ‘మ్యాడ్‌ మంకీ’ ఫ్యాషన్‌ బ్రాండ్‌ స్టార్టప్‌ను ప్రారంభించాడు. 2017లో హైదరాబాద్‌ కేంద్రంగా ఇది ప్రారంభమైంది. తెలుగులో మొదటి ఫ్యాషన్‌ బ్రాండ్‌గా మ్యాడ్‌మంకీ ఏర్పడింది. టీషర్ట్స్‌, హుడీస్‌ పై తెలుగు కంటెంట్‌ను, వైరల్‌ డైలాగ్‌ను, హీరోల బొమ్మలను ముద్రిస్తూ ఇప్పడు యూత్‌ నుంచి మంచి స్పందనను పొందుతున్నారు. మరికొందరి స్నేహితులతో కలిసి దీన్ని అభివృద్ది చేశాడు అవినాష్‌. వర్ష, అఖిలేశ్‌, కేదర్‌ప్రసాద్‌, సాయికిరణ్‌, నరేశ్‌తో ఒక బృందంగా ఏర్పాటయ్యారు. వీరు ప్రత్యేకంగా మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌, సోషల్‌మీడియాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Team-PHoto3

ట్రెండింగ్‌ ..

ఒక టీషర్ట్‌ కొంటే దాని మీద ఏ ఇంగ్లీష్‌ కొటేషనో, ఏ హిందీ డైలాగో ఉంటుంది. ఏం! మనకంటూ తెలుగులో డైలాగ్స్‌ లేవా? కొటేషన్లు దొరకవా? అంటే దొరుకుతున్నాయి. madmonkeystore.com లోకి వెళ్లి చూస్తే అన్నీ మన భాషలో కనిపించే ష్యాషన్‌ దుస్తులే. అవే ఇప్పుడు మన యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. యూత్‌ వేసుకొనే టీషర్టుల మీద ఇవే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలుగులో ఫేమస్‌ డైలాగుల, పదాలతో ఈ టీషర్ట్‌లు అనేక మందిని ఆకట్టుకుంటున్నాయి.
Team-PHoto2

ఇలా ఉంటుంది..

‘గ్యాప్‌ ఇవ్వలే వచ్చింది’ ఇటీవల ఎక్కువ పాపులర్‌ అయిన అల్లు అర్జున్‌ డైలాగ్‌.. ఈ డైలాగ్‌తో టీషర్ట్‌ ఉంటే ఎంత బాగుంటుంది అని ఫ్యాన్స్‌ అనుకోవడం సాధారణం. అలాంటి వారు ఆలోచించకుండా www.madmonkey store.com లోకి వెళ్లండి. అదొక్కటే కాదు.. ‘ఖైదీ నంబర్‌ 150, లైట్‌ తీస్కో. అది నా పిల్ల బే, లైట్‌తీస్కో, పనిచూస్కో, మాస్‌.. ఊరమాస్‌, ఇంట్లో చెప్పే వచ్చా, నన్ను ఇన్వాల్వ్‌ చేయొద్దు రావుగారు’ వంటి క్రేజీ డైలాగ్‌లతో టీషర్ట్స్‌ కనిపిస్తాయి. వీటిని ఆ వెబ్‌సైట్‌ ద్వారా కొనుక్కోవచ్చు. దీనికి యూత్‌ నుంచి మంచి స్పందన వస్తున్నది. మొదట్లో రోజుకు ఐదు నుంచి పది టీషర్ట్‌లే అమ్ముడుపోయినా తర్వాత పెరిగింది. తెలుగు రాష్ర్టాలతో పాటు వివిద దేశాల్లో ఉన్న వారికి కూడా ‘ఇంటర్నేషన్‌ షిప్పింగ్‌' చేస్తున్నారు వీళ్లు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన టీషర్ట్‌ 3-5 రోజుల్లో మీకు చేరుతుంది. సుమారు రూ. 350 నుంచి రూ. 500 లోపు ధరలున్నాయి. చేతికి అందిన టీషర్ట్‌ నచ్చకపోతే రిటర్న్‌ తీసుకుని డబ్బులు వెనక్కి ఇచ్చే సదుపాయాన్ని కూడా పొందుపరిచారు. కానీ ఇప్పటి వరకూ డెలివరీ అయిన టీషర్టులు ఒక్కటి కూడా రిటర్న్‌ రాలేదని వారు తెలిపారు. కస్టమర్ల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్‌ వస్తుందని అన్నారు.
Team-PHoto5
అవినాష్‌ది హైదరాబాద్‌. డిజైనింగ్‌, మల్టీమీడియా చదుకున్నాడు. మొదటి నుంచి ఫైన్‌ అర్ట్స్‌ మీద అభిరుచి. డిగ్రీ తర్వాత చైన్నెలో డిజైనింగ్‌లో పని చేశాడు.. అక్కడ లాంగ్వేజ్‌ కల్చర్‌ చూసిన ఆయన స్థానికంగా డిజైనింగ్‌లోనే స్టార్టప్‌ ప్రారంభించాడు. వివిధ రకాల డిజైన్లతో పాటు ప్రాంతీయ భాష, యాసలను ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. ఈ విషయం మీద యూత్‌లో క్రేజ్‌ పెంచేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇలా డివైన్‌ మంకీ ఏర్పాటు చేశాడు. ‘దీని గురించి మొదట ఆలోచన వచ్చినప్పుడు ఫలితాలిస్తుందో లేదో తెలియదు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించాను. ఆయా నగరాల్లో క్లాత్‌ను పరిశీలించి తయారీకి అక్కడ ఒప్పందం కుదుర్చుకున్నాం. మల్టీమీడియా ఫ్రెండ్స్‌తో కలిసి ఎక్కువ డిజైన్లు చేశాం. ఊహించని రెస్సాన్స్‌ వచ్చింది.. ఇంక ఆగిపోవాలనుకోలేదు. ఇప్పుడు టీషర్ట్‌లు, హుడీస్‌, విమెన్‌ టీషర్ట్‌లు అన్నీ అదిస్తున్నాం’ అని చెప్తున్నాడు అవినాష్‌.

- వినోద్‌ మామిడాల

430
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles