పీఈ పెట్టుబడులకే మొగ్గు


Sat,November 23, 2019 12:46 AM

investicii
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఐదేండ్లుగా భారతీయ రియల్‌ ఎస్టేట్‌, ముఖ్యంగా వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌పై ఎక్కువ నమ్మకం చూపిస్తున్నారు. దేశీయ పెట్టుబడిదారులు నివాస స్థలంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. భారతీయ రియల్‌ ఎస్టేట్‌ రంగం 2015 నుంచి సెప్టెంబర్‌ 2019 సంవత్సరాల మధ్య దాదాపు 14 బిలియన్ల విదేశీ ప్రైవేటు ఈక్విటీని ఆకర్షించిందని అనరాక్‌ క్యాపిటల్‌ తాజా నివేదికలో వెల్లడించింది. మొత్తం విదేశీ పెట్టుబడుల్లో 63 శాతం (88.8 బిలియన్‌ డాలర్లు) వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌కు చెందినవే కావడం గమనార్హం. రెసిడెన్షియల్‌ రంగం 1.5 బిలియన్ల విదేశీ ప్రైవేట్‌ ఈక్విటీని ఆకర్షించింది. రెసిడెన్షియల్‌ రంగం రిటైల్‌ కంటే వెనుకంజలో ఉంది. రిటైల్‌ రంగం 1.7 బిలియన్‌ డాలర్ల ప్రైవేట్‌ ఈక్విటీని ఆకర్షించింది. విదేశీ పెట్టుబడిదారులు ఎక్కువగా వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ వైపు మొగ్గుచూపుతున్నారు.


ఈ విభాగం చాలా వ్యవస్థీకృత, క్రమశిక్షణతో పాటు పారదర్శకంగా ఉండటమే దీనికి కారణం. వాణిజ్యంలో పెట్టుబడులపై రాబడి చాలా స్థిరంగా ఉంటుంది. కొన్నేండ్లుగా రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌లో రెరా, జీఎస్టీ వంటివి సంస్కరణాత్మక మార్పులు సానుకూల వాతావ రణం తీసుకువస్తున్నప్పటికీ, ఇతర సమస్యలు కూడా ఈ రంగంలో ఉన్నట్టు అనరాక్‌ క్యాపిటల్‌ తెలిపింది. అందుకే పెట్టుబడిదారులు వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. దేశీయ ప్రైవేటు ఈక్విటీ ఫండ్లు 2015 నుంచి దాదాపు 2.4 బిలియన్‌ డాలర్లను భారతీయ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడిగా పెట్టాయి. వీటిలో దాదాపు 71 శాతం(1.7 బిలియన్‌ డాలర్లు) గృహ నిర్మాణ రంగంలో పెట్టినవి. ఇది నివాస రంగానికి గడ్డు పరిస్థితి అని నివేదిక వెల్లడించింది. నిలిచిపోయిన యూనిట్టు, తక్కువ రాబడి వంటి సమస్యలతో బాధపడుతున్న రంగంలో దేశీయ నిధులు పెట్టుబడులు పెట్టడం ద్వారా గణనీయమైన లాభాలు పొందేందుకు అవకాశం లేకుండా పోయిందని పేర్కొంది. మరోవైపు వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ విభాగం గత ఐదేండ్లుగా అద్భుతమైన వృద్ధిని సాధించింది. స్థిరమైన డిమాండ్‌, పెరుగుతున్న అద్దెలు విదేశీ పెట్టుబడిదారులకు చక్కని రాబడి లభించింది.

190
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles