రెరాలో ఇవి పాటించరా?


Sat,November 23, 2019 12:44 AM

rera
నిర్మాణ రంగంలో పారదర్శకతను తెచ్చేందుకు రెరా అథారిటీ ఒక చక్కటి అవకాశాన్ని మన ముంగిట్లోకి తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో భాగం గా అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ చేయించుకోవాలని సూచిస్తున్నది. ఆతర్వాత కన్వేయన్స్‌ డీడ్‌ చేయాలని చెబుతున్నది. కన్వేయన్స్‌ డీడ్‌ చేయకపోతే, రకరకాల ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. ఒక ప్లాటు లేదా ఫ్లాటు కొనుగోలు చేశాక, దానిపై కొన్నవారికి పూర్తి హక్కు సంక్రమించాలంటే విధిగా కన్వేయన్స్‌ డీడ్‌ చేసుకోవాల్సిందే. దీంతో, ఆయా ఆస్తిపై భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తినా, అసలైన యజమానికి ఇబ్బందులు ఎదురుకావు. పైగా, ఈ డీడ్‌ చేసుకుంటే ప్రభుత్వ రికార్డుల్లో సైతం నమోదు అవుతుంది. కానీ, ప్రస్తుతం మన వద్ద ఇందుకు భిన్నంగా జరుగుతుందని కొందరు నిపుణులు అంటున్నారు.


డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుల్లో భాగంగా.. కొనుగోలుదారులు రూ.1 కోటి పెట్టి ప్లాటు కొనుగోలు చేసినా.. వాటిని అమ్మే కొందరు భూయజమానులు రూ.30 లక్షలుగా చూపెడుతూ రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్‌ డ్యూటీకి గండి పడుతున్నది. కొనుగోలుదారుల స్థలం విలువ కూడా తక్కువ చూపెడుతున్నారు. కానీ, అదే ప్రాజెక్టుల్లో స్థలం విలువ కోటి రూపాయలుంటే, అంతే విలువకు అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ను డెవలపర్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ మొత్తం అంతే కడుతున్నారు. ఒకే ప్రాజెక్టులో.. డెవలపర్‌, స్థలయజమానులు రెండు రకాలుగా డాక్యుమెంట్లను రిజిస్టర్‌ చేయడం వల్ల కొనుగోలుదారులు ఆందోళన చెందే పరిస్థితి నెలకొన్నది. రెరా అమల్లోకి వచ్చిన తర్వాత.. స్టాంపు డ్యూటీని తగ్గించేందుకు అడ్డదారులు తొక్కడం దారుణం.

నిబంధనలు పాటించేందుకు కచ్చితమైన నియంత్రణ తీసుకురావాలి. లేకపోతే, నేటికీ ఒక్కో ప్లాటును ముగ్గురు, నలుగురికి అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌ అయితే అలా జరగడానికి ఆస్కారం ఉండదు. మొత్తంగా కొనుగోలుదారులు లాభపడతారు. కన్వెయన్స్‌ డీడ్‌ డ్రాఫ్ట్‌ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. రెరా సూచిస్తున్న అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌, కన్వెయన్స్‌ డీడ్‌ పాటిస్తే కొనుగోలుదారులకు, బిల్డర్లకు అందరికీ లబ్ది చేకూరుతుంది. రెరా డ్రాఫ్ట్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి. రెరా నిబంధనలను పక్క అమలు చేసేలా సంబంధిత శాఖలకు సూచించాలి.

321
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles