రెరాకు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌


Sat,November 23, 2019 12:41 AM

కొనుగోలుదారులు, రియల్లర్లు, వినియోగదారులందరూ రెరా నిబంధనల్ని పక్కాగా పాటించేలా చేసేందుకు ఓ రాష్ర్టానికి చెందిన రెరా ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా రిటైర్డ్‌ జిల్లా జడ్జీని నియమించింది. రెరా ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ను నియామకానికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు రెరా నిబంధనలను సవరించారు. ప్రస్తుతం రెరా ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే రెరా సివిల్‌ కోర్టును ఆశ్రయిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో సమస్య పరిష్కారంలో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా రిటైర్డ్‌ జిల్లా జడ్జీని ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా నియమించారు. రెరా ఉత్తర్వుల్ని పాటించని బిల్డర్లు తొంభై రోజుల్లోపు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు అయ్యే ఖర్చును బిల్డర్లే భరించాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో రెరా ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా రిటైర్డ్‌ జిల్లా జడ్జీ నియామకం జరగడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం.

223
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles