5.5 ఎకరాల్లో కృషి గార్డెనియా


Sat,November 23, 2019 12:41 AM

ఈస్ట్‌ హైదరాబాద్‌లో ప్రణవ గ్రూప్‌ ‘కృషి గార్డెనియా’ ప్రాజెక్టును ప్రారంభించింది. ఎల్‌బీనగర్‌ రాక్‌ టౌన్‌ కాలనీలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని సంస్థ తెలియజేసింది. ఐదున్నర ఎకరాల్లో ఎనిమిది టవర్లు వస్తాయని, ఇందులో 400 ఫ్లాట్లను నిర్మిస్తామని సంస్థ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నది. తూర్పు హైదరాబాద్‌లో గేటెడ్‌ కమ్యూనిటీల్లోనే సరికొత్త ప్రమాణాల్ని నెలకొల్పే విధంగా ఈ నిర్మాణం ఉంటుందని, ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్‌ హౌజ్‌ నిర్మిస్తామని సంస్థ తెలియజేసింది.

289
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles