లెహంగాల వైభవం!


Fri,November 22, 2019 12:47 AM

కార్తీకమాసం పూర్తవుతున్న సమయానికి పెండ్లిళ్ల హడావుడి మొదలైంది. మాల్స్‌లో విభిన్నమైన డిజైన్లతో లెహంగాలు హల్‌చల్ చేస్తున్నా..కొత్తదనం కోసం మగువలు డిజైనర్ల చుట్టూ తిరుగుతున్నారు . పెండ్లికూతురువలె వివాహానికి
విచ్చేస్తున్నవారు అదనపు ఆకర్షణగా నిలువాలనుకుంటున్నారు. ఈ తరహా నచ్చేలా ఈ లెహంగాలను మీకు అందిస్తున్నాం.

Fashan
1. పౌడర్‌బ్లూ షేడెడ్ లెహంగాను అన్ని సందర్భాలకూ ధరించవచ్చు. పౌడర్‌బీడ్స్, బూడిదరంగు కట్‌దానా, స్వరోస్కి స్టోన్స్‌తో దీనిని డిజైన్ చేశాం. బ్లౌజ్‌కు నిండుగా కట్‌వర్క్ ఇచ్చాం. హాఫ్‌హ్యాండ్స్ కుట్టాం. దుపట్టాకు కలర్స్ ఎంచుకున్నాం. దీనికి కట్‌వర్క్‌తో ఫినిషింగ్ ఇచ్చాం.


2. కంచిపట్టు చీరతో లెహంగా కుట్టాం. దీనికి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్‌కు పెరల్స్, కుందన్స్, జర్దోసీతో నెమళ్లు, క్రీపర్స్‌గా తీర్చిదిద్దాం. రెడ్‌కలర్ నెట్‌దుపట్టాకు గోల్డెన్ బార్డర్ ఇచ్చాం. ఈ బార్డర్‌ను బ్లౌజ్ హ్యాండ్స్‌కు జతచేశాం.
Fashan1
3. రెడ్‌వైన్ కలర్ డబుల్‌షేడెడ్ లెహంగాలో మిలమిలా మెరిసిపోతారు. సిల్వర్ కట్‌దానా డిజైన్‌తో లైట్‌పింక్, డార్క్‌పింక్ కలర్స్ పిండ్లికూతురి కళ ఉట్టిపడేలా చేస్తుంది. డబుల్‌షేడెడ్ సాటిన్‌క్లాత్ అదనపు ఆకర్షణ ఇస్తుంది. సిల్వర్ మెటీరియల్‌తో బ్లౌజ్ డిజైన్ చేశాం. డబుల్‌షేడెడ్ దుపట్టాకు కట్‌వర్క్ చేశాం. బ్లౌజ్‌నెక్ లైన్‌షేప్‌ను దుపట్టాకు జతచేశాం.

4. ఈగ్రీన్‌కలర్ లెహంగాకు తులిప్‌షేడెడ్ వర్క్‌తో హెవీవర్క్ ఇచ్చాం. కట్‌దానా, సిల్వర్‌జరీ, సీక్వెన్స్ మెటిరియల్స్‌ను ఎంచుకున్నాం. 12 ఇంచులు హెవీవర్క్ బార్డర్‌నిచ్చాం. అంచులు సిల్వర్‌మెటీరియల్‌తో ఫినిషింగ్ ఇచ్చాం. క్రీపర్‌వర్క్‌తో బ్లౌజ్ డిజైన్ చేశాం. దుపట్టాకు స్ట్రెయిట్ బార్డర్ ఇచ్చాం. ఈ లెహంగా ఎవరికైనా నచ్చుతుంది.

5. ఈరెడ్‌కలర్ లెహంగాను విభిన్నంగా డిజైన్ చేశాం. లెహంగా మీదున్న పువ్వులు, క్రీపర్స్‌కు ఎంతోమెటీరియల్‌ను వాడాం. దీనికి థ్రెడ్‌వర్క్, కట్‌దానా, చిప్‌వర్క్ చేశాం. రెడ్ కలర్ బ్లౌజ్‌కు కాంట్రాస్ట్, జియోమెట్రిక్ షేఫ్డ్ వర్క్‌తో డిజైన్ చేశాం. దుపట్టాకు ఎంబ్రాయిడరీ వర్క్ చేశాం.

-రాజ్ సారెపల్లి
-ఫ్యాషన్ డిజైనర్
-సువర్ణ మందిర్ సిల్క్స్
facebook.com/SriSuvarnaMandir. ఫోన్ : 9000305077

289
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles