
చాలామంది పుస్తక ప్రియులు తరచూ ఏదో ఒక పుస్తకం కోసం వెతుకుతూనే ఉంటారు. కావాలనుకున్న పుస్తకం ఒక్కోసారి మార్కెట్లో ఎంత వెతికినా దొరకదు. అట్లాగే ఇంకొందరికి ఇంటర్నెట్లో పుస్తకాలు చదివే అలవాటూ ఉంటుంది. ఇలాంటి వారి కోసం ఎన్నో పుస్తకాలు పీడిఎఫ్లో అందుబాటులో ఉంటాయి.అవీ ఉచితంగానే . ఈ పీడీఎఫ్ పుస్తకాలను ప్రత్యేకంగా అందించేందుకు కొన్ని వేదికలు ఉన్నాయి. అవే ఇవి..
pustakam.net
పుస్తకాలు ఎక్కవగా ఇష్టపడే వారికి చక్కని వేదిక. పుస్తక విజ్ఞానానికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంటుంది. పుస్తకాలు చదివి సమీక్షలు రాసుకోవచ్చు. అభిప్రాయాలు, చర్చలు పెట్టుకోవచ్చు. ఉచితపుస్తకాలను కూడా దీని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వందలాది ఇంగ్లిష్, తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
kinige.com
పుస్తకాలకు చెందిన మరో ప్రముఖ వెబ్సైట్ ఇది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళ్ పుస్తకాలను ఇక్కడ కొనుక్కోవచ్చు. పుస్తక ప్రేమికుల కోసం కొన్ని అరుదైన పుస్తకాలను ఉచితంగా పీడీఎఫ్ రూపంలో ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కిడ్స్, ఫిక్షన్, నాన్-ఫిక్షన్ విభాగాలలో పుస్తకాలూ దొరుకుతాయి.
emescobooks.com
పేరుపొందిన పుస్తక ప్రచురణ సంస్థకు చెందిన వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ ద్వారా పుస్తకాలు అమ్ముతూ కొన్ని ఉచితంగా కూడా అందుబాటులో ఉంచుతున్నారు. సమయాన్ని బట్టి ఉచిత పుస్తకాలను అప్డేట్ చేస్తుంటారు. ప్రముఖ రచయితల పరిచయాలు, సాహిత్యం, అధ్యాత్మిక వ్యాసాలు ఉన్నాయి. అట్లాగే మీ దగ్గర రచనలు, వ్యాసాలు, పుస్తకాలు ఏమైనా ఉంటే ఈ సైట్లో ప్రచురించడానికి స్వీకరిస్తారు.

ఒక్కఫైల్లో వంద పుస్తకాలు..
ఈ మధ్య వాట్సాప్‌లో ‘collection’ పేరుతో ఒక ఫైల్ ఎక్కువ షేర్ అవుతున్నది. వందకు పైగా పుస్తకాలు ఈ ఒక్కఫైల్లోనే ఇమిడి ఉన్నాయి. అన్నీ మోటివేషన్ పుస్తకాలే. ఇంగ్లిష్, తెలుగులో సంచలనాలను సృష్టించిన పుస్తకాల జా బితా ఈ ఫైల్లో చూడవచ్చు. ఫైల్లో ఉన్న ఏ పుస్తకం కావాలో దాని మీద ప్రెస్ చేస్తే చాలు మొత్తం పీడీఎఫ్ వచ్చేస్తుంది. ఈ మెయిల్ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవడానికి వీలుంది. ఆ పుస్తకాలు మీరు చదవాలనుకున్నా లేదా చూడాలనుకున్నా ఈ లింక్‌ను క్లిక్ చేయండి https://bit.ly/2pszaau