ఆ తపనే కోట్లకు అధిపతిని చేసింది


Wed,November 20, 2019 12:55 AM

ఆమెకు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని ఉండేది. కానీ తల్లిదండ్రుల మాట తీసేయలేక వారు చెప్పిన కోర్సులే చేసింది. కొన్నాళ్లకు ఆమెకు పైండ్లెంది. ఇద్దరి పిల్లలు పుట్టారు. అయినా తన జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన మాత్రం తగ్గలేదు. ఆ తపనే ఆమెను కోట్లు సంపాదించేలా చేసింది.
housewife--seller
గుర్గాన్‌కు చెందిన 43 ఏండ్ల రాఖీ ఖేరా ఫ్యాషన్ రంగంలో రాణించాలనుకున్నది. ఆమె తల్లిదండ్రుల మాట కాదనలేక వారు చెప్పిన కోర్సులే చేసింది. పైండ్లె ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె లక్ష్యాన్ని చేరుకోవడానికి సిద్ధమయింది. అందుకోసం నాలుగు పదులు దాటిన తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. భర్త సహకారంతో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పట్టు సాధించింది. ఆమె సృజనాత్మకతతో సరికొత్త డిజైన్లను రూపొందించింది. వాటిని విక్రయించడానికి ఓ ఈ- కామర్స్ వెబ్‌సైట్‌ను సంప్రదించింది. వెబ్‌సైట్లో పెట్టిన రాఖీ డిజైన్లకు అనూహ్య స్పందన వచ్చింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ఆమె డిజైన్ల కోసం క్యూకట్టాయి. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద రిటెయిల్ సంస్థ అయిన వాల్‌మార్ట్ నుంచి రాఖీ డిజైన్ల కోసం ఆర్డర్లు వచ్చాయి. గర్భిణిలు, బాలింతలు ధరించేందుకు మార్కెట్‌లో ప్రత్యేకంగా దుస్తులు లేవన్న సంగతి తెలుసుకున్నది.


అటువంటి వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని దుస్తులను డిజైన్ చేసింది రాఖీ. వీటికి విపరీతంగా ఆర్డర్లు వచ్చాయి. వాల్‌మార్ట్ ఆధ్వర్యంలో మహిళా ఔత్సాహికుల అభివృద్ధి కోసం అవసరమైన అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ శిక్షణ పొందిన మహిళల్లో 150 మందికి రాఖీ సంస్థలో ఉపాధి కల్పించింది. రాఖీ ఆలోచనలను అర్థం చేసుకున్న వారంతా ఎక్కువ సమయం పనిచేశారు. అలా రెండేండ్లలో 2 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగింది ఆమె సంస్థ. ఇప్పుడు రాఖీ ఆదాయం ఏడాదికి మూడు కోట్లు దాటింది. ఎటువంటి వ్యాపార అనుభవం లేకపోయినా రాఖీ పట్టుదల ఆమెను కోట్లకు అధిపతిని చేసింది.

295
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles