ఈ-సిమ్‌తో మోటరోలా


Wed,November 20, 2019 12:52 AM

moto
మొబైల్‌ బ్రాండ్‌ కంపెనీ మోటరోలా నుంచి వచ్చిన ‘మోటో రేజర్‌' ఫోన్‌ సంచలనంగా మారింది. ఈ-సిమ్‌ నెట్‌వర్క్‌ టెక్నాలజీతో ఈ ఫోన్‌ పని చేస్తుంది. సిమ్‌తో పని లేకుండా మార్కెట్‌లోకి వచ్చిన మొదటి ఫోన్‌ కావడంతో ఆసక్తిగా మారింది. 2025 కల్లా దాదాపు అన్ని ఫోన్‌లలో ఇదే టెక్నాలజీతో అందుబాటులోకి రానున్నాయని టెక్‌ వర్గాల అంచనా. ఈ నేపథ్యంలో మోటరోలా నుంచి ఈ ఫోన్‌ రావడం అందరినీ ఆకట్టుకుంటున్నది.


స్క్రీన్‌ సైజ్‌ : రెండు స్క్రీన్‌లు 6.2 +2.7 అంగుళాలు (జీఓఎల్‌ఈడీ)
ప్రాసెసర్‌ : స్నాప్‌ డ్రాగన్‌ 710, ఆక్టాకోర్‌
ఆపరేటింగ్‌ సిస్టమ్‌ : ఆండ్రాయిడ్‌ 9పై, ర్యామ్‌ : 6జీబీ,
ఇంటర్నల్‌ స్టోరేజీ : 128 జీబీ, రియర్‌ కెమెరా : 16 ఎంపీ
ఫ్రంట్‌ కెమెరా : 5 ఎంపీ, బ్యాటరీ : 2510 ఎంఏహెచ్‌
మడతపెట్టడానికి వీలుండే ఫోన్‌ రెండో స్క్రీన్‌ ద్వారా సెల్ఫీలు తీసుకోవచ్చు. నోటిఫికేషన్స్‌, మ్యూజిక్‌, గూగుల్‌ అసిస్టెంట్‌ లాంటి ఉపయోగించుకోవచ్చు.

212
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles