ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా..


Wed,November 20, 2019 12:48 AM

instagram
ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త టూల్‌ను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతున్నది. ‘రీల్స్‌' పేరుతో అచ్చం టిక్‌టాక్‌ యాప్‌లా ఉండే సరికొత్త ఫీచర్‌ను వినియోగదారులకు అందించనున్నది. యాప్‌లోని ఎక్స్‌ఫ్లోర్‌ సెక్షన్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ‘రీల్స్‌' ద్వారా వినియోగదారులు టిక్‌టాక్‌ తరహాలోనే వీడియోలు తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. 15 సెకన్ల నిడివి గల వీడియోను రూపొందించేలా దీనిని అందుబాటులోకి తేనున్నారు. వినియోగదారులు తమకు నచ్చిన వీడియోలకు ఫిల్టర్లు, ఎడిటింగ్‌ టూల్స్‌, మ్యూజిక్‌ ట్రాక్‌లు యాడ్‌ చేసుకునేలా ‘రీల్స్‌'ను రూపొందించారు. ఇందులో టిక్‌టాక్‌ మాదిరిగానే ‘డ్యూయెట్‌' ఫీచర్‌ను కూడా అందించారు. రీల్స్‌ యాప్‌ ఆండ్రాయిడ్‌తోపాటు ఐఓఎస్‌ వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే రీల్స్‌ ద్వారా రూపొందించిన వీడియోలను యూజర్లు తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ ఈ టూల్‌ను బ్రెజిల్లో ఇప్పటికే ‘సీన్స్‌' పేరుతో అందుబాటులోకి తెచ్చింది. త్వరలో మరిన్ని దేశాలలకు దీనిని విస్తరించనున్నది.

164
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles