అమ్మాయిలు ఉప్పు తక్కువ తినాలట!


Mon,November 18, 2019 12:35 AM

ROTI
అతి ఎప్పటికైనా అనర్థమే. ఎదిగే ఆడపిల్లలు ఎంత తక్కువగా ఉప్పు తింటే అంత మంచిదని అమెరికాకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తింటే ఏమవుతుందనే విషయంపై జరిగిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇంతకీ పరిశోధకులు ఏమంటున్నారంటే..


ఆడపిల్లలకు రుతుక్రమానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం, ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పదేండ్ల వయసు నుంచే ఆడపిల్లలకు ఉప్పు ఎంత తక్కువ తినిపిస్తే అంత మంచిది. ఉప్పు అధికంగా ఉన్న జంక్‌ఫుడ్‌, ఇతర తినుబండారాలు పరిమితంగా ఇవ్వాలి. లేదంటే ఉప్పుతో కూడుకున్న కొవ్వులు హాని చేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా ప్రకారం ప్రతిరోజూ ఆ వయసు ఆడపిల్లలకు గరిష్ఠంగా ఐదు గ్రాముల ఉప్పు అందితే చాలు. అంతకు మించితే సమస్యలు ఎదురవుతాయి. సోడియం ఉండే పదార్థాలు తిన్నప్పుడు వాటిలో ఉప్పు వేయకపోవడమే మంచిది. ప్రాసెస్‌ చేసిన ఆహారం, సోయాసాస్‌, గుడ్లు, పాలు వంటివి తీసుకున్నప్పుడు సహజంగానే సోడియం అందుతుంది. అలాంటివి వాడినప్పుడు ఉప్పు ఎక్కువ వాడకపోవడమే మంచిది. ఎదిగే పిల్లలకు ఉప్పు ఎక్కువగా తినిపిస్తే రుతుక్రమం ఆలస్యమవుతుందని వారంటున్నారు. ఒత్తిడి, ఇతరత్రా అనేక మార్పులు వస్తాయంటున్నారు.

702
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles