అందానికి ఐదు చిట్కాలు


Mon,November 18, 2019 12:28 AM

Beauty
చర్మ సౌందర్యం కోసం చాలామంది మార్కెట్లో దొరికే లోషన్స్‌ వాడుతుంటారు. వీటివల్ల ఉన్న అందం కాస్త పాడవుతుంది. ఇలా మార్కెట్లో దొరికేవాటిపై ఆధార
పడకుండా ఇంట్లోనే సహజసిద్ధంగా కొన్నింటిని తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే..

-తేనె తెల్లని చర్మ కాంతిని అందిస్తుంది. తేనెను ముఖంపై రోజుకు రెండుసార్లు రుద్దడం వల్ల ముఖం మెరుస్తుంది. నిమ్మకాయ ఒక సహజసిద్ధమైన బ్లీచింగ్‌ ఏజెంట్‌. ఆరు వారాలు నిమ్మరసాన్ని ముఖానికి రుద్దడం వల్ల ముఖచర్మంపై పేరుకుపోయిన మలినాలు తొలిగిపోతాయి. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
-కీరదోసతో ముఖాన్ని రుద్దుకోవాలి. ఇలా చేస్తే ముఖం మీద ఉన్న బ్లాక్‌హెడ్స్‌ తొలిగిపోతాయి. కీరదోస ముక్కల్ని అలసిన కండ్లమీద ఉంచుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. కీరదోస గుజ్జును ముఖానికి ఐప్లె చేయడం వల్ల నల్లమచ్చలు తొలిగే అవకాశం ఉంది.
-తులసి ఆకులను బాగా ఎండబెట్టి చూర్ణంలా చేయాలి. ఇందులో కొన్ని నీళ్లు కలపాలి. ఆ తర్వాత ముఖానికి పట్టించాలి. ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారంలో రెండురోజులు చేస్తే ముఖం మెరుస్తుంది.
-ఎరుపు పప్పు, బియ్యం తెల్లని ఛాయ పొందడానికి ఉపయోగపడుతాయి. ఎర్రపప్పు, బియ్యాన్ని సమభాగాలుగా తీసుకొని నానబెట్టి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి.
-కప్పు పాలల్లో కుంకుమ పువ్వుని కలపాలి. దాన్ని వలయాకారంలో ముఖం మీద రాయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

771
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles