పరిగడుపున ఇవి తింటున్నారా?


Thu,November 14, 2019 12:53 AM

ఉదయాన్నే తినడానికి ఏం దొరకకపోతే స్వీట్లు, కేకులు, చక్కెరతో చేసిన ఆహార పదార్థాలు తింటున్నారా? అయితే అనారోగ్య బారిన పడినట్లే. అజీర్తి వెంటాడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో తెలుసుకోండి.
sweets
-ముఖ్యంగా ఉదయంపూట అదీ పరిగడుపున సిట్రస్‌పండ్లను తీసుకోకూడదు. ఇవి తీసుకోవడం వల్ల అల్సర్, గ్యాస్ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు.
-ఉదయంపూట ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఉప్పు, కారం అధికంగా ఉండే పదార్థాలను తీసుకోకూడదు.
-ఆయిల్‌ఫుడ్ తీసుకుంటే కడుపులో గ్యాస్‌ఫామ్ అవుతుంది. నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోకూడదు. ఇవి తీసుకుంటే ఛాతిలో మంట, ఉదర సంబంధిత రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది.
-కార్బోహైడ్రేట్లు ఉన్న పానీయాలను తీసుకోవడం తగ్గించాలి. సోడా, కూల్‌డ్రింక్స్‌ను ఉదయం పూట తీసుకోకూడదు. ఇకపోతే టమాటాలను కూడా పరిగడుపున తినకూడదు. ఇందులో టానిక్ యాసిడ్ ఉండడంతో పరిగడుపున తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
-పరిగడుపున స్వీట్లు తినడం వల్ల పొట్ట భాగంలో కొవ్వు అధికంగా ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి వాడిన మందారపూలతో ఔషధ టీ తయారుచేస్తారు. ఈ పువ్వులోని ఆకరషణ పత్రాలను నీటిలో బాగా కడిగి ముందుగా మరగపెట్టిన పాలలో వేసి వాటి రంగు మారేవరకు వేచి ఉండి అప్పుడు తాగాలి.
-దీంతో అందులోని పలురకాల పోషక పదార్థాలు, అధిక శాతం ఐరన్, విటమిన్లు మేలు చేస్తాయి. టీ తాగితే హైపర్ టెన్షన్ తగ్గుతుంది.

1048
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles