చిన్నారుల బాగుకోసం


Thu,November 14, 2019 12:52 AM

మురికివాడల్లో నివసించే చిన్నారులకు విద్యతోపాటు మంచి అలవాట్లు నేర్పుతూ వారి భవిష్యత్‌కు బాటలు వేసేందుకు ఓ మహిళ శ్రీకారం చుట్టింది. అందుకోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసింది. వారికి సేవ చేస్తూ తన జీవితానికి పరమార్థాన్ని వెతుక్కుంటున్నదీమె.
delhi-woman
మురికివాడల్లో ఉండే చిన్నారులు చదువుకోకుండా వీధుల వెంట తిరిగి పెడదారి పడుతున్నారు. వారి ఆలనా, పాలన పట్టించుకోకపోవడంతో వీధుల వెంట తిరుగుతూ చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు.అటువంటి వారిని చేరదీసి వారిలో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నది ఢిల్లీకి చెందిన రిచాప్రశాంత్. మురికివాడల్లో ఉండే చిన్నారులు శుభ్రంగా లేకపోవడం వల్ల వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకోవడం లేదు. దీంతో వారు వీధుల వెంట తిరుగుతూ కాలాన్ని వృధాచేస్తున్నారు. ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రిచా ఆ విషయాన్ని గమనించింది. అటువంటి వారిలో మార్పు తీసుకురావాలనుకున్నది. సమాజంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని తద్వారా మరింత మెరుగైన జీవనాన్నిసాగించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ పిల్లలను చేరదీసింది.


మొదట మురికివాడల్లోని 10మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడం మొదలు పెట్టింది. వారికి పుస్తకాలు, నోట్‌బుక్స్‌తోపాటు దుస్తులు అందించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారం తీసుకున్నది. కొన్నాళ్లపాటు పార్కుల్లోనూ, ఖాళీ ప్రదేశాల్లో ఆ చిన్నారులకు పాఠాలు చెప్పింది. కొద్దిరోజులకు పిల్లల సంఖ్య పెరిగింది. దీంతో సునాయ్ ఫౌండేషన్ పేరుతో తానే ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా ఆమె 150మంది చిన్నారులకు సేవలందించడం మొదలు పెట్టింది. రిచా చేస్తున్న మంచి పనికి సాయమందించడానికి చాలామంది దాతలు ముందుకువచ్చారు. వారి సహకారంతో ఆ చిన్నారులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్, భోజన సౌకర్యం వంటివి కల్పిస్తున్నది. ప్రస్తుతం 500 మంది పిలల్లకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నది. లక్ష మంది అనాథలకు ఆహారాన్ని అందిస్తున్నది.

456
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles