సూడోమోనాస్‌తో తెగుళ్ల నివారణ


Wed,November 13, 2019 10:19 PM

సేంద్రియ సాగు పెరిగిన తర్వాత కాయగూరలు, అపరాలు, ధాన్యాలలో జీవశిలీంద్ర నాశినుల వాడకం పెరిగింది. పర్యావరణ హాని లేకుండా తెగుళ్లు, కుళ్లు రోగాల నివారణలో సూడోమోనాస్‌ సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానశాఖ ఆధ్వర్యాలలో నడుస్తున్న జీవ నియంత్రణ ప్రయోగశాలల్లో రైతులు దాదాపు అన్ని పంటల్లో దీన్ని వాడుకోవచ్చు.


సూడోమోనాస్‌ ఫ్లోరోసెన్స్‌ ఉపయోగాలు

-ఇది మిత్ర సంబంధ బ్యాక్టీరియా.
-ఇది వరిలో వచ్చే అగ్గితెగులు, పాముపొడ తెగులు, ఎండు తెగులు, నారుకుళ్లు తెగులును అరికడుతుంది. అట్లనే పసుపు, పత్తి, మిరప, అరటి, మినుము, పెసర, పల్లి, కంది తదితర పంటలపై వచ్చు ఎండాకు తెగులు, కుళ్ళు తెగులును కూడా అరికడుతుంది.
Pserudomonas

వాడే విధానం

భూమిలో వాడటం: భూమిలో వాడటానికి 2-3 కిలోల సుడోమోనాస్‌ ఫ్లోరోసెన్స్‌ 50 కిలోల బాగా చివికిన పశువుల ఎరువులో గాని, ఇసుకతో గాని లేదా సేంద్రియ ఎరువులో గాని కలిపి భూమిలో తేమ ఉన్నపుడు చల్లాలి.

విత్తనశుద్ధి: 10గ్రాముల సుడోమోనాస్‌ ఫ్లోరోసెన్స్‌ను కిలో వరి విత్తనానికి కలిపి రోజంతా నానబెట్టి ఎక్కువగా ఉన్న నీటిని తీసివేసి మొలక వచ్చే వరకు (24 గంటలు) ఉంచి విత్తుకోవాలి.

వరి నారుమడిలో వాడటం: 10 చ. మీటర్ల నీరు నిలిచిన నారుమడిలో కిలో సుడోమోనాస్‌ ఫ్లోరోసెన్స్‌ పొడి మందును నీటిలో పూర్తిగా కలుపాలి. తర్వాత నారును ఆ నీటిలో పూర్తిగా మునిగేటట్లు 30 నుంచి 45నిమిషాల వరకు ఉంచి తర్వాత నాటుకోవచ్చు.

పంటపై పిచికారీ: 500 గ్రాముల సూడోమోనాస్‌ ఫ్లోరోసెన్స్‌ను ఎకరా వరి పంటపై నాటిన 30 రోజు నుంచి 10 రోజుల వ్యవధిలో మూడు సార్లు పిచికారీ చేయాలి. దీనిని ఉత్పత్తి తేదీ నుంచి 6 నెలలోపు వాడటం ఉత్తమం. దీని ధర కిలో 150 రూపాయలు.
-ఆసరి రాజు

రైతుబడికి ఆహ్వానం

రచనలు :
పంపవలసిన చిరునామా: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం,
రోడ్‌నంబర్‌.10, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌-500034.
[email protected], Fax-040-23291118

171
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles