ట్రెండ్‌సెట్ చేస్తున్నారు


Wed,November 13, 2019 01:39 AM

youth-brands
యువత నాడీ తెలుసుకొని, వారికి నచ్చినట్టుగా సరికొత్త ఫ్యాషనేబుల్ డ్రస్సులు మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నాయి బ్రాండెడ్ సంస్థలు. అటువంటి వాటినే ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారట. ఈ విషయం వై పల్స్ అనే ఓ సర్వే సంస్థ వెల్లడించింది. కొన్ని బాండెడ్ సంస్థలు కాలేజీ క్యాంపస్‌లో విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాయి. మరికొన్ని కంపెనీలవారు సోషల్ మీడియా ద్వారా ఓటింగ్ నిర్వహించి ఎక్కువగా ఎటువంటి వాటిని ఇష్టపడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇలా యువత అభిప్రాయానికి అనుగుణంగా వచ్చిన దుస్తుల బ్రాండ్లే 40 శాతం లాభాల్లో నడుస్తున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడయింది. యువత ఆసక్తులను పరిగణనలోకి తీసుకోని సంస్థలు నష్టాల బాట పట్టాయట. 40వేల మంది విద్యార్థులపై సర్వే చేయగా ఎటువంటి డిజైన్లు లేకుండా ఉండే దుస్తులనే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తేలింది. ముదురు రంగులు కాకుండా లేత రంగులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వారు తెలిపారు. 18 ఏండ్ల నుంచి 36 ఏండ్ల వయసు వారు నైక్ బ్రాండ్ ఉత్పత్తులకు ఎక్కువగా ఇష్టపడుతున్నారట. అడిదాస్, వ్యాన్స్, టింబర్‌ల్యాండ్, లెవీస్ వంటి 15 రకాల ప్రముఖ సంస్థల ఉత్పత్తులనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టు వై పల్స్ సర్వే సంస్థ వెల్లడించింది.

190
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles