వేసెక్టమీ ఆపరేషన్‌ను రివర్స్ చేయవచ్చా?


Sat,November 9, 2019 01:08 AM

నా వయసు 28 సంవత్సరాలు. నాకు పెడ్ల్లయి 3 సంవత్సరాలవుతున్నది. 26 నెలల వయసున్న ఒక పాప కూడా ఉంది. నేను రెండేడ్ల క్రితం వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. ఎన్నోసార్లు పలు మాగజైన్లలో వేసెక్టమీ రివర్సల్ ఆపరేషన్ గురించి చదివాను. దీనివల్ల కచ్చితమైన ఫలితాలుంటాయని వాటిలో ఉంది. మాకు ఇప్పుడు తిరిగి సంతానం కలగడానికి నేను వేసెక్టమీ రివర్సల్ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను. అది ఎంతవరకు సత్ఫలితాన్ని ఇవ్వగలదో తెలుపగలరు.
-మహేష్, మంచిర్యాల

thinkingman
మీరు తెలిపిన వివరాల ప్రకారం మీరు రెండు సంవత్సరాల క్రితం వేసెక్టమీ చేయించుకున్నారని చెప్పారు. అయితే వేసెక్టమీ రివర్సల్ పద్ధతి అందుబాటులో ఉన్నప్పటికీ వేసెక్టమీ చేయించుకున్న అతి తక్కువ సమయంలో రివర్సల్ పద్ధతి చేయించుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. మీరు రెండేళ్ల క్రితం చేయించుకున్నారు కాబట్టి రివర్సల్ వేసెక్టమీ 75 శాతం వరకు ఫలితాన్నిస్తుంది. రివర్సల్ వేసెక్టమీ రెండు పద్ధతుల్లో చేస్తారు. ఈ ప్రక్రియను నిష్ణాతులైన యూరాలజిస్టులు మాత్రమే చేయగలరు. మీ పాత మెడికల్ రిపోర్టులను తీసుకుని మైక్రోసర్జికల్ ప్రొసీజర్‌లో అనుభవం ఉన్న యూరాలజిస్టును సంప్రదించండి.


-డాక్టర్ అజిత్ విక్రమ్. వై
-యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్
-సన్‌షైన్ హాస్పిటల్స్, సికింద్రాబాద్

135
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles