కర్పూరంతో చర్మ చికిత్సలు


Sat,November 9, 2019 12:56 AM

karpuram
-ఒక గిన్నెలో టీ స్పూన్ కర్పూరం పొడిని తీసుకోవాలి. దీనిలో ఒక టీ స్పూన్ కొబ్బని నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాయాలి. ఉదయం లేచాక గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే సమస్య పరిష్కారమవుతుంది.
-చలికాలం చర్మం పగలడం సహజం. తీవ్ర చలి కారణంగా కొన్నిసార్లు చర్మంపై దురద కూడా వస్తుంది. ఈ సమస్యల నుంచి పరిష్కారం దొరకాలంటే.. ఒక టీ స్పూన్ కర్పూరం నూనెలో టీ స్పూన్ కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పగుళ్లు ఉన్నచోట రాస్తే ఫలితం కనిపిస్తుంది.
-కొబ్బరి నూనెలో మందారం ఆకులు వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత అందులో కొద్దిగా కర్పూరం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాయాలి. కొన్ని గంటల తర్వాత తలస్నానం చేస్తే పేలు తొలగిపోతాయి.
-పాదాల పగుళ్లు చాలా సాధారణ సమస్య. ఈ సమస్యకు పరిష్కారం కర్పూరం. గోరువెచ్చని నీటిలో కర్పూరం బిళ్లలు వేసి అందులో పాదాలు కొద్దిసేపు ఉంచాలి. ఆ తర్వాత బయటకు తీసి నీటితో శుభ్రం చేస్తే చాలు.

363
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles