సాదా సీదా మెరుపులు!


Fri,November 8, 2019 01:30 AM

కార్తీకమాసంలో అమ్మలు, అమ్మమ్మలు పట్టుచీరలు కట్టుకొని పూజ చేస్తారు. కాలేజీ అమ్మాయిలు ఆ చీరలను క్యారీచేయలేరు కదా కనీసం కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతారు. అమ్మాయిలు, అమ్మలు ఎవరైనా సులువుగా కట్టుకునే విధంగా సింపుల్ డిజైన్లతో కొన్ని ైప్లెన్‌చీరలను మీకు అందిస్తున్నాం. వాటిని కట్టుకొని మీరు కూడా పూజకు రెడీ అయిపోండి.
Fashan
1. పీచ్‌కలర్, గ్రీన్‌కలర్ కాంబినేషన్ సంప్రదాయంగా కనిపిస్తుంది. ైప్లెన్ పీచ్‌కలర్ షిఫాన్‌శారీకి గ్రీన్, గోల్డ్‌కలర్ బార్డర్ కుట్టాం. దీనికి కాంబినేషన్‌గా గ్రీన్‌కలర్ రాసిల్క్ బ్లౌజ్‌కు బోజ్ నెక్, హాఫ్ హ్యాండ్స్ కుట్టాం. రాసిల్క్‌కు తగినట్లుగా థ్రెడ్, ఎంబ్రాయిడరీ వర్క్ చేశాం.


2. బాడీషేప్ రావాలంటే క్రేప్‌శారీ సరైనది. గ్రీన్‌కలర్ ైప్లెన్‌క్రేప్‌శారీకి రెడ్, గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చాం. రెడ్‌కలర్ రాసిల్క్ బ్లౌజ్‌కు బోట్‌నెక్ కుట్టాం. హాఫ్‌స్లీవ్స్, నెక్‌కు గ్రీన్‌కలర్ థ్రెడ్‌వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ చేశాం. ఎలాంటి సందర్భానికైనా ఈ శారీ సరిపోతుంది.

3. ట్రెండ్‌లో ఉన్న చీరల్లో ఆర్గంజా ఒకటి. లైట్‌పింక్ ఆర్గంజా శారీకి రామాగ్రీన్‌కలర్ రాసిల్క్‌ను బ్లౌజ్‌గా కుట్టాం. బోట్‌నెక్, హాఫ్‌స్లీవ్స్ ఇచ్చాం. హెవీగా థ్రెడ్, ఎంబ్రాయిడరీ వర్క్ చేశాం. ఫెయిర్‌కలర్ ఉన్నవారికి ఈ చీర బాగా నప్పుతుంది.
Fashan1
4. వైరైటీ కాంబినేషన్ కావాలనుకుంటే దీన్ని ఎంచుకోవచ్చు. పర్పుల్‌కలర్ జార్జెట్ ైప్లెన్‌శారీకి రెడ్, గోల్డ్‌కలర్ బార్డర్ కుట్టాం. రెడ్‌కలర్ రాసిల్క్ బ్లౌజ్‌కు బోట్‌నెక్, హాఫ్‌స్లీవ్స్ కుట్టాం. నెక్, స్లీవ్స్‌కు థ్రెడ్‌వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ చేశాం. మిగిలిన బ్లౌజంతా బుజీస్ కుట్టాం.

5. రెడ్‌కలర్ షిఫాన్ ైప్లెన్‌శారీకి గ్రీన్‌కలర్ బార్డర్ ఇచ్చాం. బార్డర్‌కు గోల్డ్‌జరీని కూడా జోడించాం. గ్రీన్‌కలర్ రాసిల్క్‌బ్లౌజ్‌కు బోట్‌నెట్ పెట్టాం. నెక్‌కు థ్రెడ్, ఎంబ్రాయిడరీ వర్క్ చేశాం. హాఫ్‌హ్యాండ్స్ కుట్టాం. నెక్ కింద బుటీస్ కుట్టాం. ఈ రెండింటి కలర్ కాంబినేషన్ ఆకర్షణగా ఉంటుంది.

శ్వేతా రెడ్డి
ఫ్యాషన్ డిజైనర్
సితారిణి డిజైన్ స్టూడియో
బంజారాహిల్స్, హైదరాబాద్
www.sitarini.com
ఫోన్ : 97429 14002

307
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles