రబ్బర్‌సాగుతో గ్రామాభివృద్ధి


Fri,November 8, 2019 01:27 AM

మేఘాలయలోని గారోహిల్స్‌కు చెందిన రైతులు 30 యేండ్ల కిందట ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పంటలకు దిగుబడి లేక, పెట్టుబడి రాక సతమతమయ్యారు. అలాంటి సమయంలో అక్కడి రైతులకు రబ్బరుసాగును పరిచయం చేసింది సిస్టర్ రోజ్. ఆ తర్వాత వెస్ట్‌గారోహిల్స్ పరిసర గ్రామాల ముఖచిత్రమే మారింది.
rubber
కేరళకు చెందిన నన్ సిస్టర్ రోజ్ చిన్ననాటి నుంచే సమాజసేవకు అంకితమైంది. తాను చేసే ప్రతిపనీ సమాజానికి ఉపయోగపడాలని తపన పడేది. ప్రజాసేవ కోసమే భోపాల్ విశ్వవిద్యాలయంలో సోషల్‌వర్క్ కోర్సు చేసింది. ఆ తర్వాత మేఘాలయలోని గారోహిల్స్ మెడికల్ సిస్టర్స్‌లో సభ్యురాలిగా చేరింది. ఇది రోమన్ కేథోలిక్ చర్చిలోని నన్స్ విభాగం. అక్కడి రాజబాల ప్రాంతంలో ఏడేండ్లు సేవ చేసింది. ఆ సమయంలోనే అక్కడి గిరిజనులు పేదరికంలో మగ్గుతున్నట్లు సిస్టర్ రోజ్‌కు అర్థమైంది. కారణం వారు అవలంబించే వ్యవసాయ పద్ధతులే. వరి, పసుపు పంటలకు సరైన గిట్టుబాటులేక తీవ్ర అర్థిక పరిస్థితులు ఎదుర్కొన్నారు. వారి కోసం వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి, పశువుల సంపద పెరిగేలా చర్యలు తీసుకున్నది. అయినా అక్కడక్కడ ఆర్థిక అసమానతలు రావడంతో వారి వ్యవసాయపద్ధతినే మార్చాలనుకున్నది.


ఇందుకు తన తండ్రి కేరళలో అలవంబించే రబ్బరు సాగును వీరికి పరిచయం చేయాలనుకున్నది. రబ్బరు పంటకు ఆదాయం బాగా వస్తుంది. చెట్లు పెరుగుదలకు కొన్నేండ్లు పట్టినా.. అవి ఎదిగేకొద్దీ లాభాలు ఉంటాయి. లాభాలే తప్పా.. నష్టాలు రావు. ఇందుకోసం వెస్ట్‌గారోహిల్స్‌లోని పరిసర గ్రామాల్లో రైతులకు రబ్బరు పంటపై అవగాహన కల్పించింది. 1987లో కొంతమందిని కేరళకు తీసుకెళ్లి సాగు పూర్తి వివరాలు తెలియజేసింది. దీంతో ఆయా గ్రామాల రైతుల్లో చైతన్యం వచ్చి.. అంతా రబ్బరు సాగుకు మొగ్గుచూపారు. ఇందుకు రబ్బరు బోర్డుసైతం అనుమతులివ్వడంతో 21 గ్రామాల్లోని 500 కుటుంబాలు రబ్బరు సాగు ప్రారంభించాయి. మొదట్లో కిలో రబ్బరు రూ.15 ఉండేది. ఆ తర్వాత రబ్బరు బోర్డుతో సిస్టర్ రోజ్ పోరాడింది. 2010 నుంచి కిలో రబ్బరుకు రూ.100 వస్తున్నాయి. దీంతో రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగైంది. వెస్ట్‌గారోహిల్స్ అంతటా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఐదు శాఖలతో 22 కోట్ల రూపాయల టర్నోవర్‌ను నమోదు చేశారు. సిస్టర్ రోజ్‌కు 70 యేండ్లు వచ్చినా ప్రజాసేవ వీడలేదు.
rubber1

323
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles