సరికొత్త సైన్స్ లోకం! ఉదయించేదెప్పుడు?


Fri,November 8, 2019 01:08 AM

ఒక విజయం మరొక విజయానికి స్ఫూర్తినిస్తుంది. సాధించిన దానికి సంతృప్తి చెందు తూ, అక్కడితో ఆగిపోతే.. మరెన్నో సాధించవలసిన లక్ష్యాలు నిలిచిపోతాయి. ఇది విజేతలు చేయవలసిన పనికాదు. అలా కాకుం డా, ఒకదాని వెనుక మరొకటి అంటూ రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తే మరె న్నో విజయాలు మన సొంతమవుతాయి. ఇటీవలి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ -2019 (ఐఐఎస్‌ఎఫ్) వెనుక ఈ మూలసూత్రమే ఉంది. ఫలితంగా మన దేశానికి చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు, అధ్యాపకులు, సృజనకారులకు ఇదొక గొప్ప అవుతున్నది.
Sun


విజ్ఞానశాస్త్ర (సైన్స్) రంగం అంటేనే ఒక రకంగా డ్రై సబ్జెక్టు అన్న భావన చాలామందిలో ఇప్పటికీ ఉంది. ఇది తొలగిపోయి, పరిశోధనలు, శాస్త్ర సాంకేతికతల అభివృద్ధిలో ఆసక్తి పెరగాలంటే, ఈ రంగంలో కృషి చేస్తున్న వారికి ఎప్పటికప్పుడు తగిన ప్రోత్సాహం, గౌరవం, గుర్తింపు దక్కాలి. అది జరుగుతున్నదా? అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా గత ఐదేండ్ల కిందట 2015లో భారత అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర ఉత్సవం (India International Science Festival) మొదలై, నాటినుంచీ ప్రతీ ఏడూ జరుగుతున్నది. ఇందులో భాగంగానే తాజాగా కోల్‌కతాలో ప్రధానమంత్రి చేతులమీదుగా ప్రారంభమైన ఐఐఎస్‌ఎఫ్ ఇవాళ ముగుస్తున్నది. ఈ సందర్భంగా వైజ్ఞానిక స్పృహను ప్రజలలో పెంపొందించడంపై ఒక అవగాహన కలిగించే వ్యాసం చదువండి.

దేశం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో సాధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ లక్ష్యాలను గుర్తుకు చేసుకొంటూ, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, పరిశోధకుల కృషికి అభినందనలు అందించడమే ప్రధానాంశంగా పై ఉత్సవాలు జరుగుతున్నాయి. నిజానికిది ఎంతో సంతోషించదగ్గ పరిణామం. భారతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం కృషిని తలచుకొనే ఒక మంచి సందర్భోచితమైన వేదికగా దీనిని భావించాలి. మనవైన అధ్యయనాలు, పరిశోధనలు, ఆవిష్కరణలను గురించి చర్చించి, వాటిపై ప్రజలలో ఒక అవగాహన కలిగించుకోగలగడంతోపాటు శాస్త్రవేత్తలను ఇలానైనా గౌరవించుకొన్న వాళ్లమవుతున్నాం. ప్రభుత్వాలు, స్వచ్ఛందసంస్థలు ఎటూ పనికట్టుకొని పరిశోధకులను పెద్దగా పట్టించుకోవు. ఇలాంటి వేదికలపైన అయినా వారి కృషిని, ఆవిష్కరణలను తలచుకోగలిగితే, కొత్త తరం శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిచ్చిన వాళ్లమవుతాం.

మనిషికి తినడానికి తిండి ఎంత ముఖ్యమో జీవితంతోపాటు జీవన విధానాలూ సాఫీగా సాగడానికి సైన్స్‌పట్ల ప్రజలలో సరైన అవగాహనా ఉండాలి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో మనం సాధించిన ప్రగతిని సమీక్షించుకొంటే సంతృప్తికంటే అసంతృప్తే ఎక్కువగా మిగులుతుంది. ఎంతసేపూ రోదసీ కార్యక్రమాలే తప్ప మరో పరిశోధనలే మనకు లేవా? అన్న ప్రశ్న సామాన్యుల నుంచి వ్యక్తమవుతున్నది. విజ్ఞాన శాస్త్ర ఫలాలు ప్రజలకు అందాలంటే, టీవీలు, సెల్‌ఫోన్లు ఇంటింటా వచ్చేస్తే సరిపోతుందా? విద్య, వైద్య, వ్యవసాయ తదితర రంగాలలో సాధించవలసిన పరిశోధనలు ఏమీ లేవా? ఇండియా ఇప్పటికింకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఎందుకు పిలువబడుతున్నది? ప్రాచీన వేదవాజ్మయంలో అద్భుత విజ్ఞానం ఉందని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఆధునిక కాలంలో ఆ తరహా కృషి సల్పవలసిన అవసరం లేదా? దీనినంతటినీ ఒక్కసారి సింహావలోకనం చేసుకొంటే అసలు కారణం స్ఫురిస్తుంది. ఈ దేశ ప్రజల వ్యక్తిత్వ సామాజిక జీవన విధానాలలో కావలసినంత స్థాయిలో వైజ్ఞానిక స్పృహ లేకపోవడం, దీనిని రగిలించడంలో తగిన కృషి జరక్కపోవడం.. కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఈ స్థితిని చక్కదిద్దడానికే ప్రజలంతా విజ్ఙానశాస్ర్తాన్ని ఒక వ్యవసాయం వలె భావించాలి.

కాలానికి తగ్గట్టు ప్రజలలో ఆలోచనా విధానాలలో మార్పు రావాల్సి ఉందని సైన్స్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ శాస్త్రీయపంథాలోనే జీవించడానికి అలవాటు పడాలి. మూఢవిశ్వాసాలు, చాదస్తాలకు తక్షణం స్వస్తి చెప్పాలి. దేశ, అంతర్జాతీయ వ్యాప్తంగా అమలవుతున్న విజ్ఞానశాస్త్ర అంశాలపై ఎప్పటికప్పుడు అవగాహన ఏర్పరచుకొని ఆ మేరకుత తదనంతర పరిశోధనలకు పూనుకోవాలి. అలాంటి శాస్త్రవేత్తలను ప్రభుత్వాలు, విద్యాసంస్థలు విధిగా ప్రోత్సహించాలి. ప్రజలంతా తమ జీవనశైలిని శాస్త్రబద్ధం చేసుకోవాలి. ప్రకృతిని ధ్వంసం చేసే పనులకు పూనుకోకుండా, పర్యావరణానుకూల విధానాలను పాటించాలి. ఒక హేతుబద్ధ జీవనానికి అలవాటు పడాలి అని వారంటున్నారు.

విజ్ఞానశాస్త్ర పరంగా మనిషి ఇప్పటికి అసాధారణ ప్రగతినే సాధించాడు. తక్కువ సమయంలో ఎక్కువ పరిశోధనలతో అప్రతిహతంగా శాస్త్రవేత్తలు దూసుకెళుతున్న తీరు అత్యంత ప్రశంసనీయం. ప్రాచీన మానవ జీవన విధానానికి, ప్రస్తుత ఆధునిక పద్ధతులకు మధ్య తేడాలు చూస్తే మనకే తెలుస్తుంది, సైన్స్ సాంకేతిక రంగాల విజయాలు సామాన్యమైనవి కావని! నిప్పును వెలిగించడం, నీళ్లను తవ్వుకోవడం, ఇల్లు కట్టుకోవడం, బట్టలు నేయడం, వ్యవసాయం చేసుకొని తిండిగింజలు సృష్టించడం వంటి ప్రాథమిక అవసరాల నుంచి ఇవాళ్టికి శక్తి, ఇంధన వనరులు, యంత్రావిష్కరణలు, వాహనాల తయారీ వంటి వాటితో సుఖసౌఖ్య జీవన విధానాల్ని సాధించుకోగలిగాం. గ్రహాంతర సీమలకు ప్రయాణాలు చేస్తూ మేధోప్రగతిని అనంతంగా కొనసాగిస్తున్నాం. ఇన్ని విజయాలు సాధించినందుకు మానవజాతి ఒక మహోత్సవమే జరుపుకోవాలి.

భారతదేశానికి సుసంపన్నమైన విజ్ఞానశాస్త్ర చరిత్ర ఉన్నది. క్రీ.పూ.7000 సంవత్సరాల అప్రతిహత చరిత్రను పురావస్తు చరిత్ర సాక్ష్యాధారాలతో వెల్లడించింది. ఇందుకు తిరుగులేని నిదర్శనంగా వేదవాజ్మయంలోనే ప్రాచీన వైజ్ఞానిక విశేషాలు ఎన్నో నిక్షిప్తమై ఉన్నాయి. అందులోని వైజ్ఞానిక సత్యాలను పరిశోధనాత్మకంగా వెలికి తీయవలసిన అవశ్యకత ఇప్పటికీ ఉంది. వేదిక్ సైన్స్ నుంచి నేటి ఆధునిక భారత వైజ్ఞానిక ప్రగతి వరకు సాధించినదంతా మన భారతీయులందరం గర్వించదగ్గ ఘనత అనడంలో సందేహం లేదు. ఒకవైపు నాస్తిక ప్రపంచం మన ప్రాచీన విజ్ఞానమంతా వట్టి ట్రాష్ అని కొట్టేస్తున్న తరుణంలోనే ప్రపంచవ్యాప్త ఆధునిక శాస్త్రవేత్తలకు ఇదే ఒక దిక్సూచిలా ఉంటున్నప్పుడు, ఆయుర్వేదం నుంచి ఖగోళశాస్ర్తాల వరకు భారతీయ ప్రాచీన విజ్ఞానశాస్ర్తాల సారాన్ని లోతుగా అధ్యయనం చేయవలసి ఉంది.

గణితం, జ్యోతిషం, ఖగోళం, భాష, వైద్యం, రసాయనిక, భౌతిక శస్ర్తాలు వంటి అన్ని రంగాలలోనూ భారతదేశానికి చెందిన అనేకమంది శాస్త్రవేత్తలు, పరిశోధకుల ప్రశంసనీయమైన కృషి దాగి ఉంది. క్రీస్తుశకానికే చెందిన ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య, మహావీరాచార్య, కానద్, వరాహమిత్ర, నాగార్జున, శుశ్రూత, చరక, పతంజలి వంటి వారి నుంచి ఆధునిక కాలానికి చెందిన ప్రఫుల్ల చంద్రరాయ్, సలీమ్ అలీ, శ్రీనివాస రామానుజన్, సీవీ రామన్, హోమీ జహంగీర్ భాభా, జగదీష్ చంద్రబోస్, సత్యేంద్రనాథ్ బోస్, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్, హర్ గోవింద్ ఖురానా, ఎస్‌ఎస్ అభయంకర్, మేఘనాథ్ సాహ, ఏపీజే అబ్దుల్ కలామ్, రాజరెడ్డి, బీర్బల్ సాహిని, ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్ వంటి ఎందరో మహానుభావులున్నారు. వారందరి కృషిని, ఆవిష్కరణలను ఈ తరాల వారికి అందించవలసిన బాధ్యత మనదే.

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ -2019 (ఐఐఎస్‌ఎఫ్) వార్షిక సంబురాలు ఈ ఏటితో 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. కిందటేడాది 2018లో నాలుగవ ఫెస్టివల్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో, మూడవ ఫెస్టివల్ 2017లో తమిళనాడు రాజధాని చెన్నైలో, రెండవ-మొదటి ఫెస్టివల్స్ 2016, 2015లలో దేశరాజధాని న్యూఢిల్లీలో జరిగాయి. ఈ వేడుకలకు ఆనంద నగరంగా ఎంతో ప్రియంగా పిలుచుకొనే కోల్‌కతా వేదికైంది.
Sun1

మనసులో మొలకెత్తాలి!

ప్రజల మనసుల్లో వైజ్ఞానిక స్పృహను నాటాలి (Instil Scientific Temper Among Masses) అనే అంశాన్ని ప్రస్తుత 5వ భారత అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర ఉత్సవం ఇతివృత్తంగా ప్రకటించారు. ఇప్పటికీ ఎందరో ప్రజలు సైన్స్, సాంకేతిక విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనికి ప్రధాన కారణం, ఇది పెద్దగా అర్థం కాని అంశంగా ఉండడం. మాతృభాషలో అర్థమయ్యేలా చెప్పేవాళ్లుంటే ఈ సమస్య పరిష్కారమవుతుంది. విజ్ఞానశాస్త్ర స్వభావాన్ని ప్రజలు అలవరచుకోవాలంటే ఏం చేయాలి? అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఇందుకు విస్తృత అవగాహనా కార్యక్రమాలు అవసరం. ఈ ఐఐఎస్‌ఎఫ్ థీమ్ ఇచ్చిన స్ఫూర్తి ఆధారంగానైనా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, సైన్సు టీచర్లు, బాధ్యతగల పౌరులంతా తమ పరిధిలో సైన్సు విస్తృతికి కృషి సలపాలి.

విజ్ఞానోత్సవ స్ఫూర్తి: 5వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2019 సందర్భంగా..

344
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles