కొత్త పక్షి


Fri,November 8, 2019 12:59 AM

Pakshi-Shastram
మలేషియాకు చెందిన బోర్నియో ద్వీపం అడవుల్లో కొత్త పక్షి నొకదానిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రకం పక్షులను ఆసియా, ఆస్ట్రేలియా, సమీప దీవుల ఉష్ణమండల ప్రాంతాల పొడవునా చూడగలమని వారంటున్నారు.


డికాయిమ్ డేయకోరమ్ (Dicaeum dayakorum) గా పిలుస్తున్న ఈ ఆడపక్షి అందమైన చిన్న రంగుల పక్షి కుటుంబానికి చెందిందని, పండ్లు, పూలు, అకశేరుక (వెన్నెముక లేని) జీవులను తిని బతుకుతుందని పక్షిశాస్త్రవేత్తలు తెలిపారు. స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ నేచురల్ హిస్టరీ శాస్త్రవేత్తలు ఇటీవల దీనిని కనుగొన్నారు. 2009లోనే ఈ రకం పక్షి కనిపించినా, పదేండ్లకుగాని దీనిని పట్టుకోలేకపోయామని వారు పేర్కొన్నారు. ఈ కుటుంబానికి చెందిన మిగిలిన జాతి పక్షులకన్నా ఇది పూర్తి భిన్నంగా ఉన్నదని, కనుక దీనిని కొత్త పక్షిగానే గుర్తిస్తున్నట్లు వారంటున్నారు. బోర్నియా ద్వీపంలోని అడవుల ప్రాంతాలలో విభిన్నమైన జీవజాతులు సమృద్ధిగా ఉన్నాయనడానికి ఇదొక నిదర్శనమని పై మ్యూజియమ్ పరిశోధకులు అన్నారు. ఈ పక్షి బాహ్య లక్షణాలను కూలంకషంగా పరిశీలించిన తర్వాతే ఇది తన కుటుంబానికి చెందిన ఇతర జాతిపక్షులకన్నా ఎంతో విభిన్నంగా ఉన్నట్టు గుర్తించామని వారు చెప్పారు.

79
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles