నీరు శరీర శక్తికి నారు!


Fri,November 8, 2019 12:57 AM

Ahara-Shastram
మనం తాగే నీరు దేహానికి ఒక తప్పనిసరి పోషక పదార్థం. మిగిలిన పోషకాలకంటే ఇది విలక్షణమైన, అతిముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. చూడడానికి ఒక భౌతిక పదార్థమే అయినా ఇదొక రసాయనిక మిశ్రమం. శరీరంలోని అన్ని జీవ రసాయన ప్రతిచర్యలూ దీనిద్వారా, ఇందులోనే జరుగుతుంటై. కణాల నడిమి స్థలాల్ని ఇది భర్తీ చేస్తుంది. మాంసకృత్తులు, ైగ్లెకోజెన్ (గ్లూకోజ్‌కు బహుళ రూపం) వంటి పెద్ద పరమాణువుల నిర్మాణానికీ దోహదం చేస్తుంది. దేహంలోని అన్ని జీవకణాలు, అవయవాలు, కణజాల మనుగడకు నీరు అవసరం. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి, దేహక్రియల నిర్వహణకూ ఇది తప్పనిసరి. శరీరంలో మూడింట రెండొంతులు బరువు నీటిదే. కణజాలంలోని ప్రతీ కణంలోనూ నీరు ఉంటుంది. శరీరంలోని పదార్థాలన్నీ నీటిలోనే విలీనమవుతాయి. ఈ రకంగా మిగిలిన జీవక్రియలన్నింటి రవాణాకు నీరు ఉపయోగపడుతుంది. శరీరంలో తయారయ్యే మూత్రంలోని ప్రధాన మూలపదార్థం ఇదే. ఈ రకంగా దేహంలోని వ్యర్థ పదార్థాలు విసర్జితం కావడానికీ ఉపయోగపడుతుంది. శరీరాంతర కణజాలం చుట్టూ నీరు చేరి ఉండడం వల్లే బయటి నుంచి అఘాతాలు, గాయాలు కలిగినప్పుడు ఒకింత రక్షణనిస్తుంది. ఇన్ని ప్రయోజనాల వల్లే ప్రతి ఒక్కరూ నీటిని సమృద్ధిగా తాగాలని నిపుణులు చెబుతుంటారు. దీనికి తోడు పండ్లరసాలు, పాలు, టీ వంటి పానీయాల ద్వారాకూడా నీరు శరీరంలోకి చేరుతుంది. శరీరం డీహైడ్రేషన్ (నిర్జలీకరణ)కు గురికాకుండానూ నీరు కాపాడుతుంది.

122
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles