అన్నార్తుల ఆకలి తీర్చేందుకు...


Thu,November 7, 2019 12:26 AM

ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. పలు రెస్టారెంట్లు, హోటళ్లు ఆహార పదార్థాల తయారీలో సరైన నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడంతో అవి తిన్న వారంతా అనేక రుగ్మతల బారిన పడుతున్నారు. అలాంటి వారికి పోషక ఆహారాన్ని అందించేందుకు ఈ తల్లీ, కూతుళ్లు ఓ పుస్తకం రాశారు. ఆ పుస్తకాలు అమ్మితే వచ్చిన డబ్బుతో అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు.
Mira-Shah
వంటచేసుకునే సమయం లేక కొందరు. చేసిన వంటలు సరిగా కుదరక మరికొందరు ఆన్‌లైన్ ద్వారానే ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. అలా చేయడం వల్ల రుచిలేని ఆహారం తినాల్సి వస్తున్నది. ముంబైకి చెందిన 17 ఏండ్ల మీరాషా, తల్లి తన్విషాతో కలిసి సులభమైన వంటలు అందించేందుకు ఓ పుస్తకం రాసింది. వారిద్దరూ దేశ, విదేశాలకు చెందిన సరికొత్త రుచులను సులువుగా తయారు చేసుకునే విధానాలను పరిచయం చేశారు. ద మిలీనియన్ కిచెన్ పేరుతో పోషకవిలువలతో కూడిన ఆహారాన్ని అందించడంతోపాటు ఎటువంటి హానిలేని కూరలు తయారు చేసుకునే పద్ధతులను అందించారు.


ఈ పుస్తకాలు అమ్మగా వచ్చిన ఆదాయంలో కొంతమొత్తాన్ని అక్షయపాత్ర అనే దాతృత్వ సంస్థకు అందిస్తున్నారు. మీరాషా ఓసారి తన సోదరుడు వీర్‌తో కలిసి లండన్ టూర్‌కు వెళ్లింది. అక్కడి నిరాశ్రయులకు కొంతమంది భోజనం ప్యాకెట్లను పంచడం చూసింది. అప్పుడే సోదరుడు వీర్ మనం కూడా ఇలా అన్నార్తుల ఆకలి తీర్చవచ్చు కదా అన్నాడు. దీంతో మీరాషా వారి ఆలోచనను అమలు చేసింది. కుక్‌ఫర్ ఎ కాజ్ పేరుతో తల్లి తన్విషా, కుమార్తె మీరాషా ఇద్దరూ ఇంట్లోనే భోజనం తయారు చేసి అన్నార్తులకు అందించడం మొదలు పెట్టారు. ఆరోగ్యకరమైన వంటకాలు ఏవిధంగా తయారు చేసుకోవాలనే అంశాలపై అనేక పరిశోధనలు జరిపిన తర్వాతే పుస్తకాన్ని రాయడం మొదలు పెట్టా నని మీరాషా అంటున్నది. తల్లి సహకారంతో 40 రకాల వంటకాలకు సంబంధించిన తయారీ విధానాలు అందించామని ఆమె చెబుతున్నది. దక్షిణభారతదేశంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఎంతోమంది ఆకలి తీరుస్తున్నది. అటువంటి సంస్థకు సాయం అందించడం వల్ల మరింతమందికి మేలు జరుగుతుందని తన్విషా అంటున్నది.

313
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles