చేతివృత్తుల వారికి చేయూత


Thu,November 7, 2019 12:24 AM

చేనేత కార్మికులను, హస్తకళాకారులను ఆదుకునేందుకు ఓ మహిళా న్యాయవాది ముందుకు వచ్చింది. వారికి తనవంతు సాయం అందించడానికి వ్యాపారవేత్తగా మారింది. ఆమె సృజనాత్మకతను జోడించి సరికొత్త ఉత్పత్తులను అందిస్తూ వారికి చేయూత అందిస్తున్నది.
madhuri-aggarwal
బెంగళూరుకు చెందిన మాధురి అగర్వాల్ అనే మహిళ న్యాయవాదవృత్తిలో కొనసాగుతున్నది. ఓ రోజు ఆమె మారుమూలగ్రామంలో ఉన్న చేనేత కార్మికులు, హస్తకళాకారులు ఎదుర్కొనే కష్టాలను ప్రత్యక్షంగా చూసింది. వారికి ఏవిధంగా సాయం చేస్తే బాగుంటుందో ఆలోచించింది. వారు రూపొందించే ఉత్పత్తులకు సరైన ప్రతిఫలం ఇవ్వడం ద్వారా చేతివృత్తుల వారిని ఆదుకోవాలనుకుంది. అందుకోసం ఐదేండ్ల న్యాయవాద వృత్తిని వదిలేసింది. మాధురి చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు వ్యాపారవేత్తగా మారింది. హస్తకళాకారులకు సేవలందించడానికే ఈ రంగాన్ని ఎంచుకున్నానని మాధురి అగర్వాల్ చెబుతున్నది. న్యాయశాస్త్రంలో డిగ్రీ చదివిన ఆమెకు ఫ్యాషన్ రంగం కాస్త కొత్తగా అనిపించింది. మొదట్లో చాలా ఇబ్బందులు పడింది. దీంతో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరింది. అక్కడ సరికొత్త డిజైన్లను గురించి తెలుసుకొని అనేక ప్రయోగాలు చేసింది. కొంతమంది హస్తకళాకారులు, చేనేతకార్మికులతో ఒప్పదం కుదుర్చుకున్నది. తనదైనశైలిలో నూతన డిజైన్లను రూపొందించింది. వాటిని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.


మాధురి డిజైన్లకు అనూ హ్య స్పందన వచ్చింది. ఆమె రూపొందించిన ఉత్పత్తులు అందరికీ చేరేందుకు వేవ్స్ ఆఫ్ ట్రెడిషన్ పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. మాధురి ఉత్పత్తులకు ఇతరదేశాల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది. ఆమె అనుకున్న సమయం కంటే ముందుగానే తన లక్ష్యాన్ని చేరుకున్నది మాధురి. కేవలం రూ. 70వేల పెట్టుబడితో వ్యాపారాన్ని మొదలుపెట్టింది. రెండేండ్లలో రూ. 32లక్షలు సంపాదించింది. వచ్చిన ఆదాయంలో చేతివృత్తులవారి కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తున్నది. గతంలో కుటుంబీకులంతా కష్టపడి పనిచేసినా కేవలం రూ. 10 వేలు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు వారి ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది.

637
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles