పుదీనాతో పుత్తడి కాంతి


Thu,November 7, 2019 12:23 AM

ఆరోగ్యానికి మేలు చేసే పుదీనా అందానికీ ఎంతో మేలు చేస్తుంది. చర్మం పొడిబారినా, మొటిమలతో బాధపడుతున్న వారికీ పుదీనా రసం, ఫేస్‌క్రీమ్ ఎంతో ఉపయోగపడుతాయి. పుదీనాతో చర్మ సౌందర్యం పొందడం ఎలాగంటే..
mint-beauty
-పుదీనా ఆకుల్ని పేస్టు చేసి అందులో కొంచెం పసుపు కలపాలి. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కున్నాక ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పావుగంటయ్యాక చల్లని నీటితో కడిగేస్తే ముఖం మృదువుగా మారుతుంది.
-వారంలో మూడు రోజులు గుడ్డులోని తెల్లసొనకు కొన్ని పుదీనా ఆకుల పేస్టు కలిపి దాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే మచ్చలూ, మొటిమలూ రాకుండా ఉంటాయి. పుదీనాలో ఉండే శాలిసైలిక్ ఆమ్లం మొటిమలు రాకుండా కాపాడుతుంది.
-పుదీనా రసానికి బొప్పాయి రసం కలిపి చర్మవ్యాధులు వచ్చిన చోట రాస్తే మంచి ఫలితం ఉంటుంది. పుదీనా చర్మం ముడతలు పడకుండా త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా చూడడంలో సాయపడుతుంది.
-పుదీనా ఆకులతో తయారు చేసిన నూనె మార్కెట్లో దొరుకుతుంది. ఇది జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. చుండ్రు సమస్య నుంచి బయటపడేస్తుంది. మాడుమీద పొరలు పొరలుగా పొట్టు ఊడకుండా సంరక్షిస్తుంది.
-ఆలివ్ ఆయిల్‌లో కొద్దిగా కాఫీ గింజల పొడి వేసి దాన్ని ముఖంపై రుద్దినా కూడా మృతకణాలు తొలగిపోతాయి. బొప్పాయి, అరటిపండు గుజ్జు రుద్దినా, లేదా కొద్దిగా తేనె, పెరుగు కలిపి రుద్దినా ముఖం మీది మృతకణాలు తొలగిపోతాయి.

445
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles