మలబద్దకం నుంచి బయటపడండిలా..


Thu,November 7, 2019 12:20 AM

constipation
-మలబద్దకం నుంచి బయటపడేందుకు పొట్టపై ఆముదంతో మృదువుగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల ఆముదం కండరాల సంకోచాన్ని పెంచుతుంది. మలాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. మలవిసర్జన సజావుగా జరిగేలా చూస్తుంది.
-ఆముదం నూనెలో ఒక కప్పు నారింజ రసం కలిపి రోజుకోసారి తీసుకోవాలి.నారింజ రసంలోని ఫైబర్ మలాన్ని మృదువుగా చేయడంలో, ఆముదం మలవిసర్జనను సజావుగా సాగించడంలో సాయపడుతాయి. క్రమంగా సమస్య తగ్గిపోతుంది.
-నిమ్మరసం, ఆముదం నూనెతో మలబద్దక సమస్యను నివారించవచ్చు. దీనికి ఒక కప్పు నిమ్మరసంలో, ఒక టేబుల్ స్పూన్ ఆముదం నూనె కలపాలి. ఇందులో నూనె అడుగున పేరుకోకముందే తాగాలి. నిమ్మరసం ఆమ్ల స్వభావం మీ పేగు కదలికలను తేలిక చేయడంలో ఉత్తమంగా సాయపడుతుంది.
-మలబద్దకాన్ని నివారించడానికి పాలు, ఆముదం మిశ్రమం కూడా ఉపయోగపడుతాయి. ఒక కప్పు పాలలో 1 టేబుల్ స్పూన్ ఆముదం నూనెను కలపాలి. పాలు, ఆముదం నూనె రెండింటినీ బాగా కలిపిన తర్వాత అడుగున నూనె పేరుకోకముందే తాగేయాలి.
-ప్రతి రోజు బాగా పండిన ఒక అరటి పండు తినడం వల్ల కూడా మలబద్దకం సమస్య నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యల్ని తొలగిస్తుంది. పక్వం కాని అరటి పండు తినకూడదు.

1505
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles