వంటింటి చిట్కాలు


Thu,November 7, 2019 12:18 AM

chicken-Fry
-పూరీలు చేసేటప్పుడు అవి తెల్లగా ఉండాలంటే వేడి నూనెలో నాలుగైదు జామ ఆకులు వేస్తే సరిపోతుంది.
-క్యాబేజీ తినేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే వండేటప్పుడు రెండుమూడు అల్లం ముక్కలు వేసుకోవాలి.
-చికెన్ వేయించేటప్పుడు చక్కని రంగులో రావాలంటే పాలపొడిలో అద్ది వేయించాలి.
-రెండు చెంచాల వెనిగర్‌లో కాసిన్ని వేడి నీళ్లు, చెంచా ఉప్పు కలిపి వంటగది బల్లను శుభ్రపర్చాలి. ఇలా చేస్తే వంట చేసేటప్పుడు పడిన నూనెలో ఇతర మరకలు తొలగిపోతాయి.
-అల్లం ముక్కను నిప్పుల మీద కాల్చి తింటే వికారం తగ్గుతుంది.
-ఇంగువ జీర్ణశక్తికి సంబంధించిన సమస్యలకు మందుగా పనిచేస్తుంది. భోజనానంతరం చిటికెడు ఇంగువ, చిటికెడు ఉప్పును మజ్జిగలో కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది.
-ఉల్లిపాయల్ని మెత్తగా నూరి ఆ ముద్దని నుదుటి మీద పెట్టుకుంటే తలనొప్పి బాధ నుంచి ఉపశమనం పొందుతాం.

881
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles