యువతపై సోషల్ మీడియా ప్రభావమెంత?


Wed,November 6, 2019 01:44 AM

Survey
ప్రస్తుతం యువకులు తెల్లారి లేస్తే చాలు ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. తింటూ, నడుస్తూ చివరికి నిద్రపోయే వేళలోనూ ఫోన్ వాడుతుంటారు. మరి యువకులు ఫోన్‌లో ఏది ఎక్కువగా వాడుతున్నారు. వారిపై సోషల్ మీడియా ప్రభావం ఎంత?


ఇటీవల నాసిక్‌లోని హెచ్‌పీటీ, ఆర్‌వైకే సైన్స్ కాలేజీ విద్యార్థులు ఓ సర్వే నిర్వహించారు. సోషల్ మీడియా ఇంపాక్ట్ ఓవర్ మెంటల్లీ ఆఫ్ సిటీ యూత్ అనే అంశంపై సర్వే జరిగింది. ఇందులో 95 శాతం మంది ఎక్కువ సమయం యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌ను వాడుతున్నట్లు తేలింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన 2514 మంది యువత ఈ సర్వేలో పాల్గొన్నది. ఇందులో 1654 మంది డిగ్రీలోపు చదువుతున్నవారే. ఈ సర్వే సిటీ యూత్‌పై మాత్రమే నిర్వహించారు. సోషల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో దేని ద్వారా ఎక్కువ ప్రభావితమవుతున్నారు? అనే ప్రశ్నకు సోషల్ మీడియానే అని 81 శాతం మంది సమాధానమిచ్చారు. విద్యాభ్యాసానికి సోషల్ మీడియా ఉపయోగపడుతుందా? అనే ప్రశ్నకు 74 శాతం మంది గూగుల్ ఆధారంగా తమ సందేహాల్ని నివృత్తి చేసుకుంటున్నట్లు చెప్పారు. సబ్జెక్ట్‌ను అర్థం చేసుకోవడానికి పుస్తకాలు ఉపయోగపడతాయా? అనే ప్రశ్నకు కేవలం 39శాతం మంది యువత మాత్రమే అవునని సమాధానం చెప్పింది. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా పట్టణ యువతపైనే పడుతున్నదని ఈ సర్వే ద్వారా తేలింది.

229
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles