పట్టువదలని ఉపాధ్యాయిని !


Sun,November 3, 2019 01:23 AM

ఆమె ఓ పాఠశాలలో ఉపాధ్యాయిని రోజూ సమయానికి వెళ్తుంది. పిల్లలకు పాఠాలు చెప్తుంది. బాధ్యతగా పని చేస్తుంది. కానీ ఆమె పట్టువదలకుండా చేస్తున్న ఓ పని వల్ల అందరినుంచీ ప్రశంసలు అందుకుంటున్నది. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నది. అదేంటి అంటున్నారా? చదవండి మీకే తెలుస్తుంది.
teacher
ఒడిశాలోని జారిపాల్ గ్రామానికి చెందిన టీచర్ బినోదిని. ఆమె గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న రతియాపాల్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నది. గ్రామం నుంచి పాఠశాలకు వెళ్లాలంటే ప్రతిరోజూ ఓ నదిని దాటిలి. ఈ నదిని దాటితేనే పాఠశాలకు చేరగలదు. ఒకటో తరగతి నుంచి మూడవ తరగతి వరకు పాఠాలను బోధిస్తారామె. ఆ నదిని దాటడం అంత సులువు కాదు. నదిని దాటి వెళ్లి మరీ పాఠాలు చెప్పాల్సిన అవసరం ఏమిటని చాలామంది తరచూ అడుగుతుంటారు. నేను పాఠశాలకు వెళ్లకపోతే నా విద్యార్థుల పరిస్థితి ఏమిటి? వాళ్లకెవరు చదువు చెబుతారు? ప్రతిరోజూ నదిని దాటడం ఒక సవాలే. కానీ స్కూలుకు వెళ్లాలి అనే నా పట్టుదల ముందు నదీ ప్రవాహం ఓడిపోయింది. ప్రస్తుతం చాలా సులభంగానే నదిని దాటడం నేర్చుకున్నా. వర్షాకాలంలో మరీ ఇబ్బందిగా ఉంటుంది. రెండేళ్ల క్రితం ఒకసారి నదీ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయా. చాలా దూరం వెళ్లిన తర్వాత ఒక కొమ్మను పట్టుకోగలిగా. పిల్లలకు పాఠాలు చెప్పాలనే లక్ష్యం ముందు ఇవన్నీ చిన్నవిగా కనబడతాయి. నీటిలో ప్రయాణించడం వల్ల నా చీర పూర్తిగా తడిసిపోతుంది. అందుకనే స్కూల్లో ఎప్పుడూ యూనిఫాం పింక్ చీరను ఉంచుకుంటా. నదిని దాటుతున్నప్పుడు సెల్, మిగతా వస్తువులను ప్లాస్టిక్ సంచిలో ఉంచి తలపై పెట్టుకుంటా అంటున్నది. బినోదిని. పదేండ్ల క్రితం కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలిగా నెలకు రూ.1700లకు ఉద్యోగంలో చేరారు బినోదిని. ప్రస్తుతం ఆమె జీతం ఏడు వేల రూపాయలు.
teacher1

1146
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles