పనసపండుతో లాభాలు మెండు


Sun,November 3, 2019 01:21 AM

jackfruit
-పనసపండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోఫ్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి.
-పనస తొనలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని అనేక రుగ్మతల నుంచి ఇది కాపాడుతుంది. లంగ్స్ క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాలతో పోరాడి డీఎన్‌ఏను డ్యామేజ్ బారి నుంచి కాపాడుతాయి.
-ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటు బారి నుంచి కాపాడి గుండె నొప్పి, గుండె పోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తాయి. అస్తమా వంటి శ్వాస కోస వ్యాధుల నుంచి కాపాడుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి పనసపండు మంచి ఫలితాన్నిస్తుంది. పనసపండులో ఉండే పోషకాలు విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది.
-మధుమేహ వ్యాధితో బాధపడే వారికి ఇది మంచి ఆహారం. ఈ పండు తినడం వల్ల శరీరానికి ఇన్సులిన్ అందుతుంది. శరీరంలోని గ్లూకోజ్ లెవెల్ పెరిగేలా చేస్తుంది. ఇందులోని విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్యను తగ్గిస్తుంది. చర్మం కాంతివంతంగా మారేలా చేస్తుంది.
-పనస పండులో ఉన్న కాల్షియం ఎముకల్ని బలోపేతం చేస్తుంది. ఇందులోఉండే ఫైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాస్ అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.

462
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles