సౌందర్యం నిగారించు ఇలా


Sun,November 3, 2019 01:20 AM

వేడి నుంచి ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంచడంలో మంచు ఉపయోగపడుతుంది. అధిక చెమట, మృత కణాల నివారణ, మొటిమలు, జిడ్డు వంటి వాటిని తొలగించి చర్మాన్ని నిగారిపంజేస్తుంది.
ice
-కొన్ని మంచు ముక్కలను ఒక దూదిలో లేదా జిప్ బ్యాగ్‌లో తీసుకొని దాన్ని మొటిమల మీద కొన్ని నిమిషాలు ఉంచండి. మొటిమలు తగ్గుతాయి. నొప్పి కూడా తగ్గుతుంది.
-మేకప్ లేకుండా మంచు తక్షణమే నిగారింపుని ఇస్తుంది. మంచుముక్కలను ముఖం మీద రుద్దితే ఎలాంటి అలంకరణ లేకుండా తాజా ముఖాన్ని పొందవచ్చు
-రాత్రుళ్లు మెళకువతో ఉంటే కండ్లు ఉబ్బుతాయి. వాటిని తగ్గించడానికి మంచు ముక్కలు వాడొచ్చు. మంచు ముక్కలను కండ్లపై ఉంచడం ద్వారా కండ్లకు విశ్రాంతి లభిస్తుంది. చర్మం కూడా బిగుతుగా అవుతుంది.
-మంచుముక్కలను ముఖంపై రుద్దితే.. ఏడు నిమిషాల్లో చర్మరంధ్రాలు తెరుచుకుంటాయి.
-చర్మం ఎలర్జీకి గురైనప్పుడు ఎర్రగామారి దద్దుర్లు వస్తాయి. మంచుముక్కను వాటిమీద రద్దితే ఉపశమనం కలుగుతుంది.
-లిప్‌స్టిక్‌కు బదులుగా మంచుముక్కలు వాడొచ్చు. వీటిని పెదాలపై మృదువుగా రుద్దాలి. తర్వాత కొంచెం నెయ్యి రాసుకుంటే లిప్‌స్టిక్‌లా నిగారింపునిస్తుంది.
-మంచుముక్కలను చర్మంపై జాగ్రత్తగా ఉపయోగించాలి. చర్మంపై ఎక్కువసేపు ఉంచితే కేశనాలికలకు నష్టం కలుగుతుంది. అందుకే జిప్‌లాక్ లేదా దూదిని వాడడం సురక్షితం..

338
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles