ఆయుర్వేద ఫేస్‌ప్యాక్..


Sat,November 2, 2019 12:46 AM

Ayurvedic-face-packs
-తాజా బంతి పూలను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొంత పచ్చి పాలు, తేనె మిక్స్ చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ఐప్లె చేసి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.
-కొంత శనగపిండి, చిటికెడు పసుపును ఒక గిన్నెలో వేసుకొని కొన్ని పాలు, నీటిని కలుపాలి. మిశ్రమాన్ని చర్మంపై రాసి 15 నిమిషాల తర్వాత వెచ్చని నీటితో కడగాలి.
-ఒకటి లేదా రెండు స్పూన్ల గంధపు పొడిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ఐప్లె చేయాలి. 15 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమెలు తగ్గుతాయి. కాంతి పెరుగుతుంది. స్కిన్ సాఫ్ట్‌గా అవుతుంది.
-ఒక గిన్నెలో స్పూన్ లావెండర్ నూనె, ఒక స్పూన్ గంధపు పొడి, రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, చిటికెడు పసుపు, తగినంత వెన్న, తాజా క్రీమ్ లేదా రోజ్ వాటర్ వేసుకోవాలి. వీటిని బాగా కలిపి ముఖంపై రాసి బాగా ఆరిన తర్వాత వెచ్చని నీటితో కడగాలి.
-కొద్దిగా శనగపిండి, చిటికెడు పసుపు, నిమ్మరసం కలపాలి. రోజ్‌వాటర్ మిక్స్ చేసి స్మూత్ ప్యాక్‌లా తయారుచేసుకొని ముఖానికి ఐప్లె చేసి తర్వాత శుభ్రం చేస్తే చల్లని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల స్కిన్ సాఫ్ట్‌గా మారుతుంది.

284
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles