కంజీవరం పట్టు.. చూపు తిప్పలేరు ఒట్టు!


Fri,November 1, 2019 12:17 AM

హుందాగా ఉండాలన్నా, మామూలుగా కనిపించాలన్నా.. అది మనం వేసుకునే దుస్తుల్లోనే ఉంటుంది. అందుకే మీ స్థాయిని పెంచడానికి కంజీవరం పట్టు ఎదురుచూస్తున్నది. కంజీవరాన్ని చీరగా మాత్రమే కాకుండా లెహంగాగా వేసుకుంటే ఇక అందరిలో మీరే స్పెషల్ అట్రాక్షన్. కంచిపట్టు, కంజీవరం పట్టులతో విభిన్న రంగుల లెహంగాలు అందుబాటులోకి వచ్చాయి. మీరూ ఓ లుక్కు వేయండి.
Fashan
1. ప్యూర్ పట్టు లెహంగాకు పువ్వుల బుటీస్ ఇచ్చాం. దీనికి గోల్డ్ కంజీవరం పట్టును బార్డర్‌గా కుట్టాం. గ్రీన్‌కలర్ రాసిల్క్‌తో ఎల్బోహ్యాండ్స్ బ్లౌజ్ కుట్టాం. హ్యాండ్స్, నెక్‌కు జరీ, థ్రెడ్ వర్క్ చేశాం. లెహంగా బార్డర్‌కు మ్యాచ్ అయ్యేలా బనారస్ దుపట్టాకు బార్డర్ కుట్టాం. దుపట్టాతో అదనపు ఆకర్షణ వచ్చింది.


2. గ్రీన్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎవరికైనా నప్పుతుంది. కంజీవరం పట్టుతో లెహంగా కుట్టాం. గ్రీన్‌కలర్ రాసిల్క్‌ను ఎల్బోహ్యాండ్స్ బ్లౌజ్‌గా ఎంచుకున్నాం. బ్లౌజ్‌నెక్, హాండ్స్‌కు జరీ, థ్రెడ్ వర్క్‌చేశాం. ఆరెంజ్ కలర్ నెట్‌దుపట్టాకు గోల్డ్, సిల్వర్ బార్డర్ ఇచ్చాం. మధ్యలో పువ్వులుగా బుటీస్ కుట్టాం.

3. పట్టుబొమ్మలా ఒదిగిపోయేందుకు ఈ కంజీవరమ్ లెహంగాను ఎంచుకోండి. ఎల్లో కలర్‌కు పింక్ కలర్ బార్డర్ ఇవ్వడంతో స్పెషల్ అట్రాక్షన్ వచ్చింది. ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్‌కు పింక్, ఎల్లో కలర్‌తో థ్రెడ్‌వర్క్ చేశాం. దీనికి కాంబినేషన్‌గా ప్యూర్ బనారస్ పింక్ దుపట్టాను జతచేశాం. ఎల్లో, పింక్ కాంబినేషన్‌లో పట్టుబొమ్మ అనిపించుకోవడం ఖాయం.
Fashan1
4. పూర్తిగా కంజీవరం లెహంగాను ఇష్టపడేవారు దీన్ని ప్రయత్నించండి. కంజీవరం పట్టుతో లెహంగా కుట్టాం. బ్లూ రాసిల్క్ బ్లౌజ్‌కు జరీ, థ్రెడ్ వర్క్ చేశాం. ఎల్బో హాండ్స్ ఇచ్చాం. రెడ్‌కలర్ నెట్‌దుపట్టాకు గోల్డెన్ కలర్‌తో బార్డర్ కుట్టాం. మధ్యమధ్యలో టుబీస్‌ను జోడించాం. దుపట్టాతో లెహంగాకు గ్రాండ్ లుక్ వచ్చింది.

5. వైట్, గ్రీన్ రంగులు విభిన్నంగా ఉంటాయి. కంచిపట్టు లెహంగాకు రాణికలర్ బార్డర్ ఇచ్చాం. గ్రీన్ రాసిల్క్‌ను బ్లౌజ్‌గా కుట్టాం. నెక్, స్లీవ్స్‌కు ఎంబ్రాయిడరీ వర్క్ చేశాం. లెహంగా, బ్లౌజ్‌కు తగినట్లుగా నెట్ దుపట్టా ఇచ్చాం. దీనికి గోల్డ్ కలర్ బార్డర్ కుట్టాం.

-పవులూరి నాగతేజ
-ఫ్యాషన్ డిజైనర్, తేజ శారీస్
-కూకట్‌పల్లి, హైదరాబాద్
[email protected]

314
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles