వాంతులు తగ్గేదెలా?


Fri,November 1, 2019 12:14 AM

నేను 11 వారాల గర్భంతో ఉన్నాను. చాలా వాంతులు అవుతున్నాయి. దీనికన్నా ముందు ప్రెగ్నెన్సీలో కూడా ఇలానే ఉండింది. మందులు లేకుండా వాంతులను ఎలా మేనేజ్ చేయాలి? బిడ్డకి ఏమైనా అపాయమా?
- సౌమ్య, మహబూబ్‌నగర్

Vamtings
ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు 80 శాతం మందిలో వాంతులు కనిపిస్తాయి. కొందరిలో చాలా ఎక్కువ వాంతులు, అసిడిటీ ఉండి ఏమీ తినలేక, తాగలేకపోతారు. వారిని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. ప్రెగ్నెన్సీలో ఉండే ఒక రకమైన హార్మోన్ వల్ల ఇలా అవుతుంది. బరువు 5 శాతాని కన్నా ఎక్కువ తగ్గినా, డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంటే హాస్పిటల్లో మేనేజ్ చేయాలి. మీకు డీహైడ్రేషన్ లేదంటే ఇంట్లో చిట్కాలతో మేనేజ్ చేయొచ్చు. డైట్‌లో మార్పులు చేయాలి. షుగర్, స్వీట్లు, వేయించిన పదార్థాలు తినకూడదు. అల్లం డ్రై స్ట్రిప్స్ మార్కెట్లో దొరుకుతాయి. అవి తినవచ్చు. వాటివల్ల వాంతి సెన్సేషన్ తగ్గుతుంది. అల్లం బిస్కట్లు కూడా దొరుకుతున్నాయి. వాంతులు తగ్గేవరకు ఐరన్ టాబ్లెట్లు వేసుకోకూడదు. డైట్, ఇతర చిట్కాలు పనిచేయనప్పుడు టాబ్లెట్లు, ఐవి మెడికేషన్ తీసుకోవాలి. బిడ్డకు సరైన న్యూట్రిషన్ అందకపోతే బిడ్డలో పుట్టుకతో లోపాలు వస్తాయి. అందుకే ఇండివిడ్యువల్‌గా ప్లాన్ చేయడం మంచిది. స్కాన్‌లో బిడ్డ పెరుగుదల చూసుకోవాలి.


డాక్టర్ భావన కాసు
అబ్‌స్టెట్రిక్ గైనకాలజిస్ట్
బర్త్‌రైట్ రెయిన్‌బో, హాస్పిటల్, సికింద్రాబాద్

306
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles