ముఖంపై చెమట పడుతున్నదా?


Fri,November 1, 2019 12:13 AM

కాలంతో సంబంధం లేకుండా కొందరికి ముఖంపై చెమట పట్టేస్తుంది. దీని కారణంగా మేకప్ తొలగిపోతుంది. టీ తాగినా, ఏదైనా కారంతో ఉన్న ఆహారపదార్థాలు తిన్నా వెంటనే ముఖం నుంచి చెమట కారుతూ ఉంటుంది. అలాంటి వారు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.
Sweat-women
-ఉదయం స్నానం చేసేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే కొందరు ముఖం కడుక్కుంటారు. కానీ రోజులో అయిదుసార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాల్లోని వేడిని తగ్గించడమే కాకుండా ఎక్కువగా చెమట బయటకు రాదు. చర్మం కూడా తాజాగా మెరుస్తుంది.
-ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు కాస్త టాల్కమ్ పౌడర్ రాసుకొని వెళ్లాలి. మేకప్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. అధికంగా వచ్చే చెమటను పౌడర్ అడ్డుకుంటుంది. ముఖంపై నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి.
-ముఖంపై చెమటను తగ్గించడానికి మరో మార్గం ఐస్‌ముక్కలు. వీటిని ఓ వస్త్రంలో చుట్టి ముఖం మీద తరచూ మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ముఖ చర్మం కాంతివంతంగా మారుతుంది. చెమట కూడా పట్టదు.
-క్రీమ్స్, మేకప్‌కు దూరంగా ఉండడం మంచిది. వీటివల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి మురికి చేరుతుంది. మొటిమలు వస్తాయి. చెమట ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
-రోజూ రాత్రి నిద్రపోవడానికి ముందు కీరదోసకాయల రసాన్ని ముఖానికి రాసుకోవాలి. వేసవిలో రోజూ ఇలా చేస్తే ముఖానికి చెమట పట్టడం తగ్గుతుంది.

504
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles