జెల్లీ చేపతో గాయాలు మాయం


Fri,November 1, 2019 01:58 AM

మధుమేహ వ్యాధిగ్రస్థుల్లోని దీర్ఘకాలిక గాయాలను మాన్పడంలో జెల్లీ చేప చర్మకణాల కొల్లాజెన్‌ చక్కగా పనిచేస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. దీని భద్రత, విశ్వసనీయతలపై మరింత లోతైన అధ్యయనాల అనంతరం ప్రజలకు అందుబాటులోకి తేవచ్చునని వారంటున్నారు.
Vaidya-Aarogya-Shastram


చక్కెర వ్యాధిగ్రస్థుల్లో కొన్ని గాయాలు దీర్ఘకాలంపాటు సతాయిస్తుంటాయి. ఈ వ్యాధి భీకర పర్యవసానాల్లో ఇదొకటి. అమెరికాలో ఇదొక తీవ్రరూపు దాల్చి, బిలియన్‌ డాలర్ల వ్యయానికి కారణమవుతున్నది. ఆవులనుండి సేకరించిన కొల్లాజెన్‌ (చర్మ తదితర కణజాలాల్లోని మాంసకృత్తు) ఆధారంగా గాయాల్లోని ‘మాట్రిక్స్‌ మెటల్లోప్రొటీనేసెస్‌' (matrix metalloproteinases)గా పిలిచే ఎంజైమ్‌లను తేలిగ్గా తొలగిస్తారు. ఈ జీవద్రవ్యం (ఎంజైమ్స్‌) వల్లే గాయాలు త్వరితగతిన మానవు. గత కొన్నాళ్లుగా ‘మ్యాడ్‌ కౌ డిసీజ్‌' (ఆవుల వ్యాధి) వల్ల వాటి కొల్లాజెన్‌ లభ్యతకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలోనే పరిశోధకులు జెల్లీ చేపల చర్మం, ఇతర కణజాలాల్లోని కొల్లాజెన్‌ను సేకరించి, దానిని పందుల గాయాలపై ప్రయోగించి చూశారు. ఈ నమూనా పరిశోధన విజయవంతమైందని, మరింత లోతైన అధ్యయనంతో దీని భద్రత, విశ్వసనీయతలను నిర్ధారించుకోవలసి ఉందని పరిశోధకులు ప్రకటించారు. ఇది కనుక అందుబాటులోకి వస్తే, ఆవుల కొల్లాజెన్‌కు జెల్లీ చేపలు ప్రత్యామ్నాయం కాగలవని వారన్నారు.

128
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles