ఈ సూటుతో దేహ దుర్వాసన దూరం


Fri,November 1, 2019 01:56 AM

Aadhunika-Jeevanam
‘లండన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ సెంట్రల్‌ సెయింట్‌ మార్టిన్స్‌'కు చెందిన పరిశోధకులు బెల్జియంలోని గెంట్‌ (Ghent) యూనివర్సిటీ శాస్త్రవేత్తల సహకారంతో ‘స్కిన్‌-II’ పేరుతో బాడీసూటును రూపొందించారు. లేత బూడిద వర్ణంలో చూడడానికి ఒక స్వెట్టర్‌లా కనిపించే ఈ పొడవు చేతుల సూటు ధరించిన వారి శరీర దుర్వాసనను తగ్గుముఖం పట్టిస్తుందని పరిశోధకులు అంటున్నారు. దుర్వాసనను దూరం చేసే ఆరోగ్యవంతమైన సూక్ష్మజీవులతోకూడిన సాంకేతికతతో ఈ వస్ర్తాన్ని తయారుచేశారు. సూటులో వాసనను పోగొట్టే సూక్ష్మజీవులు ఉన్నాయన్న ఆలోచనకు అవకాశం లేకుండా, అత్యంత సహజసిద్ధంగా తయారు చేయడం దీనిలోని ప్రత్యేకతగా చెబుతున్నారు. క్రీడాకారులు ధరించడానికి వీలయ్యే రీతిలోనే దీనిని డిజైన్‌ చేశారు. ఇందులో ఎలాంటి విష రసాయనాలూ వాడలేదని కూడా వారు చెబుతున్నారు. ప్రయోగ స్థాయిలో విజయవంతమైన ఈ సూటు ప్రజలకు అందుబాటులోకి రావడమే ఇక తరువాయి.

188
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles