అతిపెద్ద నిహారిక


Fri,November 1, 2019 01:54 AM

Vishwa-Visheshalu1
భూమికి 1,70,000 కాంతి సంవత్సరాల దూరంలోని ‘టరాంటులా’ (Tarantula) ను అతిపెద్ద నెబ్యులా (నిహారిక)గా ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యంత చురుగ్గా నక్షత్రాలు ఆవిర్భవిస్తున్న ప్రాంతంగానూ వారు దీనిని భావిస్తున్నారు. ఇది సుమారు 1,800 కాంతి సంవత్సరాల మేర సువిశాలమైన అంతరిక్ష ప్రదేశాన్ని ఆక్రమించింది. ‘30 డొరడస్‌' (30 Doradus) గానూ పిలుస్తున్న ఈ నిహారిక మన పాలపుంత (మిల్కీవే) చుట్టూ వున్న ‘లార్జ్‌ మ్యాజెలెనిక్‌ క్లౌడ్‌' (Large Magellanic Cloud) లో నెలకొని ఉన్నది. అందమైన అంతరిక్ష ధూళి, వాయువులతో చిన్న, యుక్తవయసు తారల పుట్టుకలు ఇక్కడ నిరంతరాయంగా జరుగుతున్నట్టు వారు పేర్కొన్నారు.


మహా గెలాక్సీ

విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ (నక్షత్రమండలం)లలో ఒకటి ‘ఐసీ 1101’. ఇది ‘ఏబెల్‌ (Abell) 2029 గెలాక్సీ క్లస్టర్‌' నట్టనడుమ నెలకొని ఉన్న దీర్ఘవృత్తాకార గెలాక్సీ. మనం జీవిస్తున్న భూమికి ఆవాసమైన సౌరకుటుంబానికి నివాసమిచ్చిన పాలపుంత సుమారు 1,00,000 కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. దీనితో పోల్చినప్పుడు ‘ఐసీ 1101’ తారామండలం ఎంత భారీదంటే, ఇంతకు 50 రెట్లు పెద్దదేకాక 2,000 రెట్లు అధిక ద్రవ్యరాశిని కలిగి ఉన్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని మొత్తం విస్తీర్ణం 5.5 మిలియన్‌ (55 లక్షలు) కాంతి సంవత్సరాలు.
Vishwa-Visheshalu

187
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles