సామాజిక రుగ్మతలపై లేఖాస్త్రం


Thu,October 31, 2019 12:23 AM

సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని చాలామంది నమ్మలేకపోతున్నారు. అనవసర మైన సందేశాలను పంపించడం వల్ల వాస్తవాలు మరుగున పడుతున్నాయి. దీంతో చేతితో ఉత్తరాలు రాసి సామాజిక రుగ్మతలపై లేఖాస్ర్తాన్ని సంధిస్తూ జనాలను చైతన్య పరుస్తున్నది ఓ మహిళ.
paromita-letter
అసొంకు చెందిన పరొమిత అనే మహిళ లేఖల ద్వారా ప్రపంచ దేశాల్లోని వ్యక్తుల్లో మార్పు తీసుకువచ్చేందుకు ముందుకు వచ్చింది. నేటితరం సోషల్ మీడియా మాయలో పడిపోయి చేతితో రాసిన అక్షరాలను ఆస్వాదించడం మానేశారు. అందుకోసమే పరొమిత సామాజిక సమస్యల గురించి అపరిచితులకు ఉత్తరాలు రాస్తూ వారి మనసులను కదిలిస్తున్నది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ల ద్వారా పరిచయమైన వారికి తాను చేపట్టిన ఉద్యమం గురించి వివరిస్తున్నది. ఆమె చేస్తున్న ఉద్యమ లక్ష్యాన్ని తెలియజేస్తున్నది. పరొమిత మంచిపని నచ్చినవారు ఆమెతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. మొదట్లో ఆమె రాసిన ఉత్తరాలకు పెద్దగా స్పందించేవారు కాదు. ప్రస్తుతం ఆమె లేఖలకు స్పందించి జవాబు ఇచ్చే వారి సంఖ్య పెరిగింది. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉండే వారిలో సైతం పరొమిత రాసే లేఖలు చైతన్యం తీసుకువస్తున్నాయి. ఆమె చేస్తున్న ఉద్యమంలో కలిసి నడిచేందుకు ప్రతి నెలా 30 మంది కొత్త వారు ముందుకు వస్తున్నారు. కీబోర్డుతో టైపు చేస్తే కేవలం శరీరాన్నే తాకుతాయి. అదే చేత్తో రాస్తే అక్షరాలు మనసుకు తాకుతాయని ఆమె అంటున్నది. ప్రపంచంలో ఏ మూలన ఉన్న వారికైనా పరొమిత ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతుంది. ఆమె ఆలోచనతో కలిసి నడిచేవారే ఆమెకు వారి చిరునామా పంపుతారు. అటువంటి వారికే పరొమిత లేఖలు రాస్తుంటుంది. ఇప్పటి వరకు గృహహింస, లింగభేదం, మహిళలను కట్టుబాట్లకు పరిమితం చేయడం, మహిళ ఆర్థిక సాధికారత వంటి అంశాలపై లేఖలు రాసింది పరొమిత.

189
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles