తల నెరుస్తుందా?


Thu,October 31, 2019 12:22 AM

జుట్టు చివర్లు నెరవడం. చిట్లడం, రాలడం ప్రస్తుతం చాలామంది ఎదుర్కొన్న సమస్యే. అలాంటి వారు మందార ఆకులు, మందార పూలతో జుట్టును కాపాడుకోవచ్చు.
whihair
-ఏడెనిమిది చొప్పున మందార పూలు, ఆకుల్ని శుభ్రంగా కడిగి ముద్దలా చేయాలి. కప్పు కొబ్బరి నూనెను వేడి చేసి ఈమిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి. నూనె చల్లారాక వడకట్టి రాత్రుళ్లు తలకు రాసుకొని మర్నాడు తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
-తెల్లవెంట్రుకలతో బాధపడేవారు గుప్పెడు మందార ఆకులూ, నాలుగు పెద్ద చెంచాల పెరుగు తీసుకొని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుండడం వల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.
-మూడు చెంచాల ఉసిరిపొడి, రెండు చెంచాల ఉసిరిరసం, గుప్పెడు మందార ఆకుల్ని తీసుకొని మెత్తగా చేసుకోవాలి. ఈ ముద్దను తలంతా పట్టించి నలభై నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చాలు.
-ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి వేడిచేయాలి. మరుగుతున్న నీళ్లలో గుప్పెడు మందార ఆకులు, అయిదారు పూలు వేయాలి. కాసేపు మరిగించాలి. చల్లారాక ఆకుల్ని ముద్దలా చేయాలి. కొద్దిగా శనగపిండి కలిపితే షాంపూ తయారైనట్లే.
-ఏడెనిమిది మందార పూలను ముద్దలా నూరుకోవాలి. దీన్ని తలకు పట్టించి గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో ఒకటిరెండు సార్లు చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.

861
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles