గోనె సంచి తొడుక్కుందామా!


Wed,October 30, 2019 01:00 AM

gone-sanchi
యూత్‌ ఎప్పుడూ కొత్తదనాన్నే కోరుకుంటుంది. కొందరు ట్రెండ్‌ ఫాలో అయ్యేవాళ్లుంటారు. మరికొందరు ట్రెండ్‌ సెట్‌ చేసేవాళ్లు. నిత్య నూతనంగా ఉండేవాళ్లు ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. అంతే కొత్తగా ఆలోచిస్తున్నది వస్త్ర వ్యాపార రంగం.


‘వెరీ కంఫర్ట్‌' పేరుతో ఇటీవల ఓ ప్యాంటు మార్కెట్లోకి వచ్చింది. ఇది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గోనెసంచితో తయారు చేసిన ఈ ప్యాంటు ఖరీదు రూ.800 నుంచి 1500 వరకు ఉంది. ఇందులో వివిధ మోడల్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. బూట్‌ కట్‌, ప్యార్‌లాల్‌, పెన్సిల్‌ ఫిట్‌.. ఇలా ఎన్నో రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇవి ఢిల్లీలోని అతిపెద్ద మార్కెట్‌ అయిన హాథ్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నవి. అయితే ఈ గోనె సంచి ప్యాంటు సాధారణంగా రఫ్‌గా ఉంటుంది. అందుకని లోపలి వైపునకు కాటన్‌ క్లాత్‌ కుట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. “భవిష్యత్‌లో ఇవే ఫ్యాషన్‌” అవుతాయేమో! అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

265
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles